నీల్ ఫ్యామిలీతో తారక్ బాండింగ్.. ఎంత స్ట్రాంగ్ అంటే..

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. మిగతా భాషల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సిల్వర్ స్క్రీన్ పై కనపడకపోవడంతో అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. చేతి నిండా చిత్రాలతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి దేవర సినిమా చేస్తుండగా.. మరో ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టారు. అయితే ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన మూవీ అనౌన్స్మెంట్ గత ఏడాదే వచ్చింది. ఓ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇక నీల్ తో మాత్రమే కాకుండా అతని ఫ్యామిలీకి కూడా తారక్ చాలా దగ్గరయ్యాడు. వారి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందొ ఇటీవల వైరల్ అయిన ఫిక్స్ చూస్తేనే అర్ధమవుతుంది.

ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలలో షూటింగ్ మొదలు కానున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే ప్రశాంత్ నీల్ తో తారక్ దిగిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖితా రెడ్డితో తారక్, లక్ష్మీ ప్రణతి తీసుకున్న ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య సతీమణి తో కలిసి బెంగుళూరుకు వెళ్లిన తారక్ నీల్ ఇంటికి కూడా వెళ్లారు. అప్పుడు తీసుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక అదే మీటింగ్ లో సినిమా కోసం చర్చలు కూడా జరిపి ఉంటారని చెబుతున్నారు. తారక్ కు కన్నడ శాండిల్ వుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలతో కూడా మంచి అనుబంధం ఉంది. అప్పట్లో పునీత్ రాజ్ కుమార్ సినిమా కోసం పాట కూడా పాడారు. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రగతి, హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిర్గందూర్‌ తో కలిసి దిగిన చిత్రాలను తారక్.. అప్పుడు బెంగళూరు డైరీస్ అంటూ షేర్ చేశారు.

అయితే తారక్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రశాంత్ నీల్.. NTR 31ను తెరకెక్కించనున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందించనున్నారు. ఎన్టీఆర్, నీల్ సినిమా ఓ రేంజ్‌ లో సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని టాక్. దేవ‌ర‌, వార్ 2 షూటింగ్స్ తో బిజీగా ఉన్న తారక్.. అవి పూర్తయ్యాక NTR 31 షూటింగ్ లో పాల్గొంటారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.