పగలు సీఎం… రాత్రి పబ్ లో

భరత్ అనే నేను సినిమా పోలిటికల్ బ్యాక్ డ్రాప్ అని, అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తారని ఇప్పటికే బయటకు వచ్చేసింది. అసెంబ్లీ సీన్లు కూడా పిక్చరైజ్ చేసారు. సరే, సినిమా అన్నాక, ప్రేమకథ జోడించకుండా ఎలా వుంటారు. అందువల్ల ఎవరి ఊహాగానాలు వారు చేసుకుని, రానా నటించిన లీడర్ సినిమాలా వుంటుందని డిసైడ్ అయిపోయారు.

అయితే మరీ లీడర్ సినిమాలా వుంటే, కొరటాల శివ ఆ కథ మీద ఎందుకు మోజు పడతారు? కోటి రూపాయలు ఇచ్చి బయటి నుంచి కథ ఎందుకు కొనుక్కుంటాడు? అంటే సమ్ థింగ్ అందులో ఏదో వుండి వుండాలి. తండ్రి చనిపోతే కొడుకు సీఎం కావడం అన్నది ఒక్కటే లీడర్ లో మాదిరిగా కామన్ పాయింట్ అయివుండొచ్చు.

అందుతున్న సమాచారం ప్రకారం భరత్ అనే నేను సినిమాలో రాజకీయాలు చాలా తక్కువ పార్ట్ నే వుంటాయని, యూత్ కు కనెక్ట్ అయ్యే విషయాలు చాలా వుంటాయని తెలుస్తోంది. పగలు సీఎంగా వుండే మహేష్ బాబు, సాయంత్రం వేళకు పబ్ లు, డ్యాన్స్ లు, రొమాన్స్ లతో సేదతీరేలా సినిమా వుంటుందని తెలుస్తోంది. మూడు సక్సెస్ లు కొట్టిన కొరటాల, నాలుగోసక్సెస్ ను అంత సులువుగా వదులుకోడుగా?