పుష్ప రాజ్ కు అంతర్జాతీయ వేదిక నుంచి ఆహ్వానం


ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు గుర్తు పట్టేంతగా పాపులారిటీని దక్కించుకున్నాడు. అందుకే పుష్ప రాజ్ అల్లు అర్జున్ కు అంతర్జాతీయ స్థాయి వేదికలపై జరిగే కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ఆహ్వానం అందడం జరుగుతుంది.

తాజాగా అల్లు అర్జున్ కు ఆగస్టు 21వ తారీకున న్యూయార్క్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్ ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ కు ఆహ్వానం దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా కార్యక్రమ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

ఆగస్టు 21 న జరిగే 40వ భారత దినోత్సవ పరేడ్ కు అల్లు అర్జున్ సారధ్యం వహించబోతున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా కూడా భారత స్వాతంత్య్ర వైభవంను ఈ కార్యక్రమంలో ప్రస్థావించబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (FIA) అధ్యక్షుడు కెన్నీ దేశాయ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ హాజరు కాబోతున్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.

అల్లు అర్జున్ తో పాటు స్థానిక మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో పాటు ఇండియా నుండి పలువురు రాజకీయ మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు మరియు ఎన్నారై లు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నాడు. అల్లు అర్జున్ కు ఈ అరుదైన గౌరవం రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 2 సినిమా షూటింగ్ కు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కనుక ఈ లోపు ఇండియా డే పరేడ్ లో బన్నీ పాల్గొని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాదికి ఒక్కరు చొప్పున ఈ గౌరవం ను దక్కించుకుంటారు. 2022 సంవత్సరానికి గాను బన్నీకి దక్కడం.. తెలుగు ప్రేక్షకులు అంతా కూడా గర్వించదగ్గ విషయం అన్నట్లుగా అల్లు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.