మెగా వారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. మరి వరుణ్ తో వివాహం అనంతరం లావణ్య యాధావిధిగా సినిమాలు కొనసాగిస్తుందా? లేక పెళ్లి తర్వాత కుటుంబ జీవితాని కే అంకితమవుతందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లావణ్య లైన ప్ లో సినిమాలు పెద్దగా లేవు. తమిళ్ లో ‘తానల్’ అనే సినిమా చేస్తుంది. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా తప్ప కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో లావణ్య కావాల ని కొత్త సినిమాల కు సంతకం చేయలేదా? లేక అవకాశాలు రాక ! అన్నది మరో సందేహం. మరి వాహహం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. ఈ అంశం పై ఇంత వరకూ తనవైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఇక మెగా క్యాంప్ నుంచి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయ నిహారిక పెళ్లైనా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాతగా మాత్రమే వెబ్ సిరీస్ లు చేసింది.
నటి గా దూరంగానే కనిపించింది. తాజాగా మళ్లీ ఇప్పుడిప్పుడే నటిగానూ యాక్టివ్ అవుతుందని కథనాలొస్తు న్నాయి. అందుకు సూచిక గా సోషల్ మీడియా లో ఆమె కొత్త ఫోటోలు షేర్ చేయడం వంటివి నిహారిక ఫ్యాషన్ ని గుర్తు చేస్తున్నాయి. మరి ఇదే కోవలో లావణ్య కూడా కొనసాగుతుందా? అన్నది చూడాలి. మెగా క్యాంప్ నుంచి తొలిసారి నటి గా పరిచయమైంది నిహారిక మాత్రమే.
ఇంకెవరూ ఆ కుటుంబం నుంచి మ్యాకప్ వేసుకోలేదు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత బ్యాకెండ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. కానీ ఇంతవరకూ ఏనాడు మ్యాకప్ వేసుకోలేదు. ఇక చిన్న కుమార్తె శ్రీజ కూడా యాక్టింగ్ వైపు రాలేదు. అలాగే కోడలు ఉపాసన తొలి నుంచి బిజినెస్ ఉమెన్ గా ఉన్నారు.
కేవలం బిజినెస్ లోనే బిజీ గా ఉంటారు. హీరోయిన్లలో చాలా మంది స్నేహితులున్నారు. వాళ్లతో అప్పుడప్పుడు గెట్ టూ గెదర్ అవ్వడం తప్ప! సినిమా డిస్కషన్స్ పెద్దగా రావు. కానీ లావణ్య త్రిపాఠి నటి గా ఫేమస్ అయిన తర్వాత మెగాస్టార్ ఇంట కోడలి గా అడుగు పెడుతుంది. మరి ఈ బ్రాండ్ తో నటి గా కొనసాగుతుందా? లేక కోడలిగానే కంటున్యూ అవుతారా? అన్నది చూడాలి.