ప్రభాస్ రికార్డ్.. హాలీవుడ్ మూవీ బ్రేక్ చేసేలా ఉంది!

హాలీవుడ్ సినిమాలకి ఇండియాలో మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. అందుకే హాలీవుడ్ మేకర్స్ సైతం కచ్చితంగా తమ సినిమాలని ఇండియన్ భాషలలో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం అయితే మూవీ ప్రమోషన్స్ కోసం ఇండియా రావడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మార్వెల్ సిరీస్, డీసీ కామిక్ సూపర్ హీరో సిరీస్ లకి ఇండియాలో మంచి ఆదరణ ఉంది. జేమ్స్ కామెరూన్ సినిమాల తర్వాత అంతగా ఇండియన్ మార్కెట్ లో భారీ కలెక్షన్స్ ని సాధించే సినిమాలు ఇవే అని చెప్పొచ్చు.

జేమ్స్ కామెరూన్ అవతార్ 2 మూవీ ఇండియాలో మొదటి రోజు ఏకంగా 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియాలో ఇదే హైయెస్ట్ హాలీవుడ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ సాధించింది ఈ సినిమానే. ఈ సినిమా సౌత్ లోనే అత్యధికంగా 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అయితే తరువాత మరికొన్ని హాలీవుడ్ మూవీస్ వచ్చిన ఈ రికార్డ్ ని బ్రేక్ చేయలేదు. మార్వెల్ సిరీస్ లో భాగంగా జులై 26న వాల్వరిన్ అండ్ డెడ్ పూల్ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వస్తోంది.

ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషం. ఇండియాలో కూడా ఇప్పటి వరకు 1.2 లక్షల టికెట్స్ కేవలం మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ అయినా పీవీఆర్, ఐనాక్స్, సినిపోల్స్ లో బుక్ అయ్యాయంట.

దీనిని బట్టి సినిమాకి ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ రెండు రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా వాల్వరిన్ అండ్ డెడ్ పూల్ మూవీ ఇప్పుడు హిందీలో డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కల్కి మూవీ హిందీ వెర్షన్ 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఏడాది బాలీవుడ్ హైయెస్ట్ ఫస్ట్ డే వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ 21 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని వాల్వరిన్ బ్రేక్ చేయొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో 30 కోట్ల వరకు మొదటి రోజు ఈ చిత్రం వసూళ్లు చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఒక్క హిందీలోనే 18-20 కోట్ల మధ్య కలెక్షన్స్ ని మొదటి రోజు వాల్వరిన్ అండ్ డెడ్ పూల్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.