ప్రస్తుతానికి ‘ మెగా చైర్’ ప్రభాస్ కి ఇచ్చేయచ్చు!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక్కో హీరో ఒక్క శకం తనదైన ఛరిష్మాతో దశాబ్దాల కాలం పాటు నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పారు. తెలుగు సినిమా అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆయన నెంబర్ వన్ హీరోగా సుదీర్ఘకాలం తన ప్రస్థానం కొనసాగించారు. పౌరాణిక, సాంఘిక చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్రని సీనియర్ ఎన్టీఆర్ లిఖించారు. ఆయనతో పాటు ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్స్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలబడిన నెంబర్ వన్ గా మెగా చైర్ మాత్రం అతని నుంచి ఎవరు అందుకోలేకపోయారు.

నెక్స్ట్ జెనరేషన్ కి వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి ఆ స్థానంలోకి వచ్చారు. టాలీవుడ్ సినిమా కమర్షియల్ హంగులు హద్దుకొని కలర్ లోకి మారిన తర్వాత డాన్స్, ఫైట్స్ లతో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని టాప్ హీరోగా చిరంజీవి నిలబడ్డాడు. తద్వారా ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ నెంబర్ హీరో స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అందుకోగలిగారు. చిరంజీవితో పాటుగా టాలీవుడ్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలు చేస్తూ స్టార్స్ గా ఎదిగారు. అయితే మెగాస్టార్ ఇమేజ్ ని మాత్రం ఎవ్వరు టచ్ చేయలేకపోయారు.

ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే అందరికి మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తారు. అంతగా టాలీవుడ్ సినిమా చరిత్రలో చిరంజీవి తనదైన ముద్ర వేశారు. ఇప్పటికి అదే చరిష్మాని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ సీనియర్ హీరోల జాబితాలోకి వెళ్లిపోయారు. అతని తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా చైర్ ఎవరిదనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య చాలా కాలంగా పోటీ నడిచింది. అయితే సడెన్ గా మధ్యలోకి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వచ్చారు.

బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ అమాంతం పెరిగిపోయాయి. బాహుబలి సిరీస్ ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఆ స్థాయిని ఇంకా అందుకోలేదు. బాహుబలి తర్వాత, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, ఇప్పుడు కల్కి 2898ఏడీ సినిమాలు ప్రభాస్ నుంచి వచ్చాయి. ప్రతి సినిమా కూడా మొదటి రోజే 100+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని టచ్ చేసింది. ఈ ఫీట్ ని ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ ఒక్క హీరో అందుకోలేదు.

ప్రమోషన్స్ చేయకపోయిన ప్రభాస్ నటిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తే ఆ మూవీకి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చేస్తోంది. ఓ విధంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రస్తుతం ప్రభాస్ రూల్ చేస్తున్నాడని చెప్పొచ్చు. సినీ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు టాలీవుడ్ లో మెగాస్టార్ తర్వాత నెంబర్ వన్ హీరో బ్రాండ్, మెగా చైర్ కోసం పవన్, మహేష్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ మధ్యలో గట్టి పోటీ నడిచింది.

అయితే వీరందరిని బీట్ చేసి ప్రభాస్ కి ఇప్పుడు ఆ చైర్ లో దర్జాగా కూర్చునే రేంజ్ వచ్చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కల్కి మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోన్న నేపథ్యంలో అతని నెక్స్ట్ సినిమాలకి కూడా అదే రేంజ్ మార్కెట్ క్రియేట్ అవ్వనుంది. టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన డార్లింగ్ ప్రభాస్ మెగా చైర్ లో కూర్చోవడానికి పూర్తిస్థాయిలో అర్హత కలిగి ఉన్నాడని అందరూ ఒప్పుకుంటున్నారు.