బర్త్ డే స్పెషల్: రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను తెరకెక్కించారు. కెరీర్లో నాటి ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, నేటి జనరేషన్ లో అల్లు అర్జున్ వరకూ ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసారు. అలాగే ఆయన వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళని తెలుగు సినిమాకి హీరోలుగా పరిచయం చేసాడు. అలాగే అతిలోక సుందరి శ్రీదేవి, కుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్ప శెట్టి, తాప్సి లాంటి ఎందరో హీరోయిన్స్ ని కూడా ఆయన తెలుగు సినిమాకి పరిచయం చేశారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోస్ తో కూడా డిఫరెంట్ సినిమాలు చేసి వారి కెరీర్ కి పూల బాట వేశారు.

ఆయన అందించిన బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, క్లాసిక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాటల్లో అందం, హీరోయిన్ గ్లామర్ ను చూపించడంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. 45 ఏళ్ల కెరీర్లో ఆయన అందించిన అద్భుతాలెన్నో ఉన్నాయి. నేడు ఆయన జన్మదినం సందర్భంగా దర్శకేంద్రుడికి తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన టాప్ 10 సినిమాలు మీకోసం..

1. బాబు: శోభన్ బాబుతో తెరకెక్కించిన ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. భవిష్యత్ సినిమాల్లో తన ప్రభంజనానికి ఈ సినిమా ఉపయోగడినా తర్వాతి సినిమా జ్యోతితో హిట్ ట్రాక్ పట్టారు.