బహిరంగంగా, భార్యతో హీరో లిప్‌లాక్స్!

అతడు ముద్దులు పెట్టుకున్నది భార్యనే అయినా ఆ లిప్‌లాక్స్ మాత్రం హీటెక్కిస్తున్నాయి. లేటు వయసులో అమీర్ ఖాన్ దంపతుల ఘాటు రొమాన్స్ హాటుగా ఉంది. పబ్లిక్ ప్లేసులో అమీర్ ఖాన్ కిరణ్ రావును ముద్దాడాడు. ఏదో సున్నితంగా కాదు.. చాలా కాంక్షతోనే రెచ్చిపోయాడు.లిప్ కిస్సులతో ఈ దంపతులు బహిరంగ రొమాన్స్ చేశారు. సినిమాల్లోని రొమాంటిక్ సీన్లకు తీసిపోని రీతిలో ఉంది అమీర్, కిరణ్ రొమాన్స్. అమీర్ ఖాన్, కిరణ్ రావు బంధం లేటు వయసులోనే మొదలైంది.

అయితే పుష్కరకాలం నుంచి వీళ్లిద్దరూ జంటగానే ఉన్నారు. సరోగసి పద్ధతిలో సంతానాన్ని కూడా పొందారు. సినిమాలకు మించిపోయే రీతిలో ఇప్పుడు లిప్‌లాక్స్ తో వీళ్లు తమ ప్రేమబంధం గట్టిగా ఉందని నిరూపించుకుంటున్నారు.కిరణ్ రావు మూలాలూ తెలంగాణతోనే ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు. వనపర్తి సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన వ్యక్తి కిరణ్.