బాలయ్యతో మంచు విష్ణు ?

మలయాళ సినిమా అయ్యప్పన్ కోషియమ్ మీద చాలా పట్టుదలగా వుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఎన్వీ ప్రసాద్ లాంటి సీనియర్ నిర్మాత ఈ సినిమాను చూసారు. ఇంకా మరి కొందరు టాలీవుడ్ నిర్మాతలు కూడా చూసి, ఇది తెలుగుకు పనికిరాదు అని పెదవి విరిచారు. కానీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ మాత్రం ఈ సినిమాను ఎలాగైనా తెలుగులో బాలయ్య హీరోగా చేయాల్సిందే అన్న పట్టుదలగా వున్నారు.

అయితే ముందుగా రైట్స్ కొనేసి, కోటి రూపాయలు డెడ్ చేసుకోకుండా, కాస్టింగ్ సెట్ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్లాలని ప్లాన్. బాలయ్య ఓ హీరో అని మెంటల్ గా డిసైడ్ అయిపోయారు. మరో యంగ్ హీరో కావాలి. ఎవరు? ఎవరు? బాలయ్య దగ్గరకు వెళ్లినా ముందు వచ్చే ప్రశ్న అదే.. అందుకే ఈ యంగ్ హీరో క్యారెక్టర్ కోసం బాలయ్య ఓకె అనే పేరు కోసం వెదుకుతున్నట్లు బోగట్టా.

ఈ క్రమంలో మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయ్యపన్ కోషియమ్ లో అయ్యప్పన్ క్యారెక్టర్ కు బాలయ్య ను, కోషియమ్ క్యారెక్టర్ (మలయాళంలో పృధ్వీరాజ్ చేసారు) కు విష్ణును తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సంగతి ఎలా వున్నా, అసలు ఈ సినిమాను తీసి తీరాలి తెలుగులో అనే నాగవంశీ పట్టుదల చూసి, వరుసగా హిట్ లు పడుతుంటే, ఇలాంటి థీమాలే వస్తాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.