హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాకే వెనుకబడిన తరగతుల గురించి ప్రభుత్వ పరంగా ప్రాధాన్యమిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దక్కించుకున్నారని బిసి కమిషన్ ఛైర్మన్ బిఎస్‌రాములు అన్నారు. శనివారం భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రంథాలయంలో జరిగిన బిసి నాయకుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల కులాలకు కులాల వారీగా వృత్తుల ప్రాముఖ్యతను సైతం గుర్తించి చేపలు, మేకలు, గొర్లు, బర్లు ఇలా ఎవరి అభివృద్ధికి ఏమేం కావాలో గుర్తెరిగి సమకూర్చిన బాధ్యత గల తొట్ట తొలి ప్రభుత్వంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించుకున్నారని అన్నారు రాష్ర్టానికి గోదావరి జిలాలతో సస్యశ్యామలం చేయడం వల్ల వివిధ రకాలుగా లబ్ధిపొందింది బిసి కులాలేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ లోనే కేసీఆర్ చలవ వల్లనే అత్యధిక మొత్తాన్ని వృద్దులు , వితంతువులు ఫించన్ అందుకుంటున్నారని బిఎస్‌రాములు పేర్కొన్నారు. పద్మశాలీ మగ్గానికి సరైన పనిచెప్పి బతుకమ్మ చీరలతో ఆడబిడ్డలకు ఓ పెద్దన్నగా ఇంటికి పెద్ద కొడుకుగా కేసీఆర్ భాసిల్లుతున్నారని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ గతంలో బిసి కమిషన్‌గా పనిచేసిన వారెవరూ బిఎస్ రాములు మాదిరిగా ఆలోచించిన దాఖ లాలు లేవని అఆ్నరు రాష్ట్రంలోని వెనెకబడిన కులాలకు ఏం చేయాలో ప్రభుత్వానికి నివేదించిన ఘనత కూడా రాములుకే దక్కుతుందన్నారు.