ఆర్సీ 16 సెట్స్ కి వెళ్లడానికి రంగం సిద్దమవుతోంది. రామ్ చరణ్-బుచ్చిబాబు ఏక్షణమైనా షూటింగ్ మొదలు పెట్టవచ్చు. అందుకు తగ్గ ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఇది స్పోర్స్ట్ బ్యాక్ బ్రాప్ స్టోరీ అని అంటున్నారు. ఈ కథ కూడా 90-80 నేపథ్యంతో కూడినదని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా కోసం బుచ్చిబాబు సెట్ల కోసమే 80 కోట్లకు పైగా ఖర్చు చేయిస్తున్నాడుట.
ఒరిజినల్ లుక్ కోసం ఎక్కడా క్రాంప్రమైజ్ కాకుండా సెట్లు డిజైన్ చేయిస్తున్నాడుట. ఆర్ ఎఫ్ సీలో ఆ సెట్ల నిర్మాణం జరుగుతుందని సమాచారం. ఈసినిమాకి సంబంధించిన ఆర్ట్ వర్క్ ఏడాదిన్న కాలంగా జరిగిందిట. అందుకు అనుగుణంగా సెట్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ఈ సెట్ లో వందలాంది మంది కార్మికులు పనిచేస్తున్నారని సమాచారం.
బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ వృద్ది సినిమాస్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదుట. రూపాయి పెట్టాల్సిన చోట మరో రూపాయి అదనంగానే ఖర్చు చేస్తుందిట. దర్శకుడి విజన్ కి తగ్గట్టు…అతడు కోరుకున్న విధంగా ప్రతీది ఉండాలని స్ట్రిక్ట్ అదేశాలు ప్రొడక్షన్ టీమ్ కి ఇచ్చి అన్ని రకాలుగా సహకరిస్తుందిట. బడ్జెట్ పరంగా మైత్రీ నిర్మాణ సంస్థ అన్నది ఓ బ్రాండ్. అందులో డౌట్ లేదు. మంచి నీళ్లలాగా ఖర్చు చేస్తుంది.
ఈ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి కేటాయించారు. అంతకు అదనంగానే ఖర్చు అవుతుందని నిర్మాణ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా కోసం పస్ట్ క్లాస్ టెక్నిషియన్లను రంగంలోకి దించుతున్నారు. ఈ విషయంలో బుచ్చిబాబు ఎంతో లక్కీ. రెండవ సినిమానే ఈ రేంజ్ లో చేస్తున్నాడు? అంటే అతడి ప్రతిభ ఒక కారణమైతే అంతకు మించి సుకుమార్ బ్యాక్ బోన్ గా ఉండటం అది పెద్ద కారణం అనొచ్చు.