హాలీవుడ్ స్టార్ జానీ డెప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ భార్య అంబర్ హార్డ్ నుంచి వచ్చిన 15 మిలియన్ డాలర్ల డబ్బును చారీటీలకు విరాళంగా ఇచ్చేయాలని నిర్ణయించారు. మొత్తం ఐదు చారిటీలను ఎంపిక చేసి వాటికి ఇవ్వాలన్నది డిప్ ప్లాన్ గా తెలుస్తుంది.
ఇప్పటికే వాటి ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. భార్య డబ్బు చారిటీలకు పంచేయడం ఏంటి? ఇక్కడ రివర్స్ లో జరుగుతోంది? అనుకుంటు న్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
జానీ డెప్ తన మాజీ భార్యపై వేసిన పరువు నష్టం దావా కేసులో విజయం సాధించారు. జానీ డెప్ మాజీ భార్య నటి అంబర్ హర్డ్‌పై పరువు నష్టం దావా కేసులో డెప్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది.
2018 డిసెం బర్ లో అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అంబర్ హర్డ్ రాసిన కథనానికి వ్యతిరేకంగా ఆయన దావా వేశారు. అదే సమయంలో 36 ఏళ్ల నటి అంబర్ హర్డ్.. తన మాజీ భర్త జానీ డెప్ ఆరోపణలు బూటకమని పేర్కొంటూ 100 మిలియన్ డాలర్లకు దావా వేశారు.
జానీడెప్ -హర్డ్ 2011లో `ది రమ్ డైరీ` అనే సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలుసుకున్నారు. అలా మొదలైన స్నేహం ప్రేమగా మారింది. అది పెళ్లిగా రూపం దాల్చింది. కానీ ఆ దంపతులు ఎంతో కాలం కలిసి ఉండలేదు. రెండు సంవత్సరాలకే కోర్టు మెట్లు ఎక్కారు. జానీ డెప్ భార్యపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించారు.
లైంగిక ఆరోపణ…మాదక ద్రవ్యాల దుర్వినియోగం అభియోగాలపై కేసు నమోదైంది. ఆ తర్వాత మీడియాలో రకరకాల కథనాల నేపథ్యంలో ఇద్దరి మధ్య పెద్ద వార్ నడించింది. ఇరువురు పరువు నష్టం దావా కేసులు వేసుకున్నారు. ఇందులో జానీ డెప్ విజయం సాధించడంతో మాజీ భార్య నుంచి డబ్బు అందింది.