మాస్ కొట్లాటలో విజయ్ దేవరకొండ.. రిస్కేమో?

దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ పరుశురామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం సక్సెస్ తరువాత హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. దానికి తోడు సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు.

దీంతో సినిమా ఆ పండగ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ తో ఎక్కువ శాతం ఆకట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. సినిమా పనుల్లో కొంత ఆలస్యం జరుగుతూ ఉండడంతో సంక్రాంతికి ఫైనల్ అవుట్ పుట్ వచ్చే అవకాశం లేదు అనే విధంగా కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి.

ఇక నిర్మాత దిల్ రాజు చేసేదేమీ లేక సినిమాను మార్చి నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్చి 8 అయితే బాగుంటుంది అని ఆలోచిస్టునట్లు తెలుస్తోంది. అయితే అదే సమయానికి విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రానున్నట్లు నిర్మాత ఇటీవల క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

అయితే రీసెంట్ గా రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కూడా అదే డేట్ కు ఫిక్స్ చేసుకోవడం విశేషం. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రాస్టిక్ గా మాస్ అంశాలు ఉన్న కంటెంట్ తో తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విశ్వక్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు పోస్టర్స్ ద్వారానే క్లారిటీ వచ్చేసింది.

పూరి జగన్నాథ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కూడా పూర్తిస్థాయిలో మాస్ సినిమాగా రానుంది. ఇక ఈసారి సంజయ్ దత్ ను కూడా రంగంలోకి దింపారు కాబట్టి యాక్షన్ డోస్ గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ రెండు మాస్ సినిమాల మధ్యలో వస్తే ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ కంటెంట్ తో ఎంతవరకు క్లిక్ అవుతుంది అనేది మరో అతిపెద్ద డౌట్.

దిల్ రాజు ఒక్క ప్రణాళికతో తన సినిమాలను విడుదల చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రెండు సినిమాల మధ్యలో ఆయన రిస్కు తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. ఏదేమైనా ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు తప్పనిసరిగా సక్సెస్ రావాలి.. కాబట్టి రిలీజ్ విషయంలో కూడా సేఫ్ గా పోటీ పడాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఈ పోటీ ఎంతవరకు నిజమవుతుందో.