‘మా’ కొత్త ట్విస్ట్‌.. సహజ నటి అధ్యక్ష పోటీకి సిద్దం

మా ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయని అనిపిస్తుంది. ప్రతి ఒక్క మా సభ్యుడు కూడా ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు ఎవరై ఉంటారా అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రకాష్‌ రాజ్ మొదట అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత మంచు విష్ణు కూడా తాను పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇక జీవిత రాజశేఖర్ మరియు హేమలు కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ లో జయసుద పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆమె సొంతంగా అధ్యక్ష పోటీకి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే నలుగురు అధ్యక్ష పోటీకి సిద్దం అయ్యారు. ఇలాంటి సమయంలో ఆమె కూడా అధ్యక్ష పోటీకి సిద్దం అయితే పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆమె పోటీ చేసి రాజేంద్ర ప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు. కనుక ఈసారి ఆమెను గెలిపించే ఉద్దేశ్యంతో అంతా ఉన్నారు. మరి అందుకు ఇతర అభ్యర్థుల నుండి గట్టి పోటీ వస్తుంది. కనుక ఆమె గెలుస్తుందా లేదా అనేది చూడాలి.