ఓ కథ పుట్టడం అంత సులువు కాదు. అయితే పుట్టిన ప్రతీ కథకు తప్పకుండా ఏదో ఒక మూలం ఉంటుంది. అది నిజ జీవితంలో జరిగిన సంఘటన లేదా ఏదైనా ఊహాతీతం అయినా ఉండొచ్చు.దాన్నే కథగా తీర్చిదిద్ది సినిమాగా మారుస్తుంటారు దర్శకరచయితలు.
అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకరచయితలు మీమ్స్ మీద పడబోతున్నారని అర్థమవుతోంది. తాజాగా దర్శకుడు వక్కంతం వంశీ దీనికి నాంది పలికారు. ఆయన తెరకెక్కిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో బాహుబలి మీమ్‌ను ఉపయోగించి ఓ సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. సినిమాలో హీరో నితిన్‌ను జూనియర్ ఆర్టిస్ట్‌గా బాహుబలి దండాలయ్య సాంగ్‌లో ఉన్నట్లు ఓ ఫన్నీ కామెడీని క్రియేట్ చేశారు.
గతంలో బాహుబలి ట్రైలర్ రిలీజైనప్పుడు ఇలాంటి స్ఫూఫ్ మీమ్స్ చాలా వైరల్ అయ్యాయి. దాన్నే తీసుకుని తన సినిమాలో సన్నివేశాన్ని క్రియేట్ చేశారు వక్కంతం వంశీ. అసలే ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్‌కు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా సినిమాకు – మీమ్స్‌కు విడదీయరాని బంధం ఉంది. ఓ చిత్రంలోని సన్నివేశాలకు.. ప్రస్తుత సందర్భానికి తగ్గట్టుగా మార్చి ఫుల్ కామెడీని పండిస్తుంటారు మీమర్స్.
అయితే ఇప్పుడు కాస్త కథను రివర్స్ చేసి.. ఏకంగా తన ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా కోసం మీమ్స్‌ను వాడేశారు వక్కంతం వంశీ. వాస్తవానికి ఓ సింగిల్ మీమ్‌తో పూర్తి కథను నడిపించలేం కదా.. అందుకే తన చిత్రం కోసం జూనియర్ ఆర్టిస్లపై వచ్చిన చాలా మీమ్స్‌ను ఉపయోగించి తనదైన స్టైల్లో హిలేరియస్‌గా కథను చూపించబోతున్నట్లు సమాచారం అందింది.