మెగా హీరోయిన్ కష్టం ఇప్పటికి ఫలించింది

మెగాస్టార్ మేనల్లుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో అవకాశం దొరికితే ఏ హీరోయిన్ అయినా లైఫ్ సెటిల్ అయిపోతుందనే నమ్ముతుంది. కానీ సాయి ధరమ్ తేజ్ తొలి హీరోయిన్ సయామీ ఖేర్ కి రేయ్ చిత్రం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది.

విడుదల ఆలస్యంగా జరగడంతో అప్పటికే సాయి ధరమ్ తేజ్ పరిచయం పిల్ల నువ్వు లేని జీవితంతో జరిగిపోయింది. ఎప్పటికో విడుదలయిన రేయ్ డిసాస్టర్ అయి వైవిఎస్ చౌదరి జాడ దొరక్కుండా పోయింది. ఇక అందులో నటించిన హీరోయిన్ కి ఫ్యూచర్ ఏముంటుంది.

పెద్దగా అవకాశాలు రాకపోయినా కానీ సయామీ కష్టపడి ఫిట్నెస్ మెయిన్ టైన్ చేసింది. అథ్లెట్ కావడం ఆమె అదృష్టాన్ని మార్చింది. హాట్ స్టార్ లో స్పెషల్ ఓప్స్ అనే సిరీస్ లో సయామీ కి ఛాన్స్ దొరికింది. అందులో లేడీ స్పై గా సయామీ టఫ్ గా కనిపించడమే కాకుండా స్విమ్ సూట్స్ లో తన అందాలని ఆరబోసి ఆకట్టుకుంది. మొదటి సీజన్లో తనకి ఎక్కువ స్క్రీన్ టైం లేకపోయినా కానీ ఆడియన్స్ కి ఆమె నచ్చడంతో సెకండ్ సీజన్లో లెంగ్త్ పెంచుతున్నారని తెలిసింది.