యంగ్ మెగా హీరో సరసన సినిమాను సైన్ చేసిన రకుల్ ప్రీత్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అవకాశాల పరంగా కొంత స్ట్రగుల్ అవుతోన్న విషయం తెల్సిందే. గతేడాది మన్మథుడు 2 తర్వాత రకుల్ కెరీర్ గ్రాఫ్ బాగా డౌన్ అయిపోయింది. ప్రస్తుతం నితిన్ సరసన చెక్ చిత్రంలో నటిస్తోంది రకుల్. పూర్తి భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నాక లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఈ సినిమా కాకుండా కమల్ హాసన్ – శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు 2 లో కూడా రకుల్ కీ రోల్ ప్లే చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం రకుల్ మరో అవకాశాన్ని పట్టేసింది. యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ రెండో సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ఎంపికైనట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఇంకా మొదటి సినిమా విడుదల కాకుండానే రెండో సినిమా కన్ఫర్మ్ అయింది. క్రిష్ ఈ చిత్రాన్ని తన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.