ఆ మధ్య మెగా మేనల్లుడు సాయితేజ్ భారీ బైక్గు యాక్సిడెంట్ కి గురై తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలు పాటు విశ్రాంతి తప్పలేదు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని కోలుకు న్నారు. మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా ఆ సమయంలో వ్యక్తిగతంగా తాను ఎలాంటి విమర్శలు ఎదుర్కున్నారో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.
‘ప్రమాదంతో మంచాన పడ్డా నేను పూర్తి గా కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు ఎంతో అండగా నిలబడ్డారు. నా పనులన్నీ వాళ్లే చూసుకునేవారు. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక సోషల్ మీడియా లోకి ‘నీ పనైపోయింది.. రిటైర్మెంట్ తీసుకున్నావా? అంటూ జోకులు వేశారు. ‘నేనేమైనా కావాలని గ్యాప్ తీసుకున్నానా? యాక్సిడెంట్ అవడం వల్ల బ్రేక్ వచ్చింది. అయినా అప్పుడు కూడా నేను ఖాళీ గా లేదను. పుస్తకాలతో స్నేహం చేశాను. నాకిష్టమైన బొమ్మలతో ఆడుకునే వాడిని.
కానీ ఈ ప్రమాదం వల్ల నాకు మాట విలువ బాగా తెలిసింది. ఎప్పుడు లొడ లొడా వాగే నాకు యాక్సిడెంట్ వల్ల ఒక్కసారి గా మాట పడిపోయింది. జనాలేమో వీడు తాగేసి మాట్లాడుతున్నాడంటూ జోక్ చేశారు. కానీ గొంతు పెగిలి మాట రావడం లేదని ఎంత బాధపడ్డానో? నాకు మాత్రమే తెలుసు. ఆ పెయిన్ ఎలా ఉంటుందన్నది అనుభవించిన వారికే తెలుస్తుంది. అప్పుడే నాకు మాట విలువ బాగా తెలిసొచ్చింది. ఆ సమయంలో నా చుట్టుపక్కల వాళ్లు నాకు ఎంతో సపోర్ట్ చేశారు.
నేను చెప్పేది అర్థం కాకపోతే- నాన్న అర్థం అవ్వలేదు. మళ్లీ చెప్పు అనేవారు. ‘రిపబ్లిక్’లో చిత్రంలో నాలుగు పేజీల డైలాగ్ అవలీల గా చెప్పిన నాకు సగం పేజీ డైలాగ్ చెప్పడానికి కూడా నోరు తిరగలేదు. నా తోటి నటులు చాలా సహకరించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మందు తాగి వచ్చావా? మాట పోయిందా? అని జోకులు వేశారు. కానీ ఇవేమీ నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు’ అని అన్నారు. ప్రస్తుతం సాయితేజ్ నటించిన ‘విరూపాక్ష’ ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకొస్తుంది. అలాగే మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు ‘సుప్రీమ్’ హీరో కమిట్ అయి ఉన్నారు.