యూరోప్ బయల్దేరిన పవన్ హీరోయిన్

తన సినిమా షూటింగ్ కోసం పవన్ ఇప్పటికే బల్గేరియా వెళ్లిన విషయం తెలిసిందే. ఆల్రెడీ అక్కడ షూటింగ్ కూడా స్టార్టయింది. ఇప్పుడిదే షెడ్యూల్ లో పాల్గొనేందుకు హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ కూడా యూరోప్ బయల్దేరింది. నిన్న సాయంత్రం విమానం ఎక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు నుంచి షూటింగ్ లో పాల్గొంటుంది.

పవన్ సినిమాకు నవంబర్ 12వరకు కాల్షీట్లు ఇచ్చింది అను. ఈ షెడ్యూల్ లో పవన్-అనుపై ఓ సాంగ్ తీయబోతున్నారు. త్వరలోనే మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా యూరోప్ షెడ్యూల్ లో పొల్గొంటుంది. పవన్-కీర్తి సురేష్ పై కూడా ఓ సాంగ్ తీస్తారు. దీంతో పాటు యూరోప్ లోనే పవన్ పై ఓ యాక్షన్ బ్లాక్ కూడా ప్లాన్ చేశారు.

ఈ భారీ షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది యూనిట్. ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉంటే హైదరాబాద్ లో పూర్తిచేసి.. నవంబర్ ఎండింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయింది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేయాలని అనుకుంటున్నారు. మూవీకి అజ్ఞాతవాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాను రిలీజ్ చేస్తారు.