‘రంగస్థలం’ను అంటే ఎలా అండీ?

సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు మరియు రామ లక్ష్మీ ప్రేమకథ చూడాలని ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాని సుకుమార్ మార్చి కి పోస్టుపోన్ చేశారు. కానీ ఒక్క రంగస్థలం సినిమా డిలే వల్ల ఇంకా రెండు సినిమాలు కూడా లేట్ అయిపోతున్నాయి.

రామ్ చరణ్ రంగస్థలం కోసం గెడ్డం పెంచుకున్న విషయం తెల్సిందే. ఇంకా కొంత ప్యాచ్ వర్క్ మిగిలిపోవడం వల్ల తను ఇప్పటికే ఒప్పుకున్న బోయపాటి సినిమా చేయలేకపోతున్నాడు. ఇదిలా ఉండగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా రంగస్థలంలో ఇరుక్కుపోగా సై రా నరసింహ రెడ్డి షూటింగ్ కూడా లేట్ అవుతోంది. ఒకపక్క ప్రొడ్యూసర్ లు ఏమో డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అంటూ బాధపడుతున్నారని.. సుకుమార్ సినిమా రంగస్థలం నిర్మాతలకే కాక చెర్రీ-బోయపాటి మరియు “సైరా” సినీమా ప్రొడ్యూసర్లకి కూడా జేబుకు చిల్లు పడేలా చేస్తోంది అంటూ ఫిలిం నగర్లో కామెంట్స్ చేస్తున్నారు.

కాకపోతే.. ఒక సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించడం వల్ల వేరే సినిమాలు ఆగిపోతున్నాయి అంటే ఎలా? క్వాలిటీ ఔట్పుట్ కావాలి, భారత దేశం తలెత్తుకునే సినిమాలు రావాలి అనే క్రిటిక్స్ ఒక సినిమా లేట్ అయింది అని ఏడిస్తే ఎలా? మంచి సినిమాలు రావాలి అనేది వాళ్లే, ఇలా లేట్ అయితే తిట్టేది వాళ్లే. ఇలా అయితే ఎలా అండీ?