రంగస్థలం సక్సెస్ నాకు ప్లస్ అవుతుంది: నాని

ఓ సినిమా పెద్ద హిట్ అయితే దానికి పోటీగా మరో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ జంకుతారు. కానీ నాని మాత్రం దీనికి రివర్స్. రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి తన సినిమా కూడా ఆడుతుందంటున్నాడు. రంగస్థలం సక్సెస్ తనకు కలిసొస్తుందని వెరైటీ లాజిక్ చెబుతున్నాడు.

“చాలామందికి అర్థంకాని విషయం ఏంటంటే.. థియేటర్లలో ఆల్రెడీ హిట్ అయిన సినిమా ఉంది కదా, మన సినిమా ఏం ఆడుతుందని భావిస్తుంటారు. లేదంటే 2-3 నెలల నుంచి ఏ సినిమా ఆడట్లేదు కదా ఇలాంటి టైమ్ లో మన సినిమా వస్తే బాగుంటుందని అంటారు. ఈ రెండు అభిప్రాయాలు తప్పు. ఓ సినిమా హిట్ అయితే జనాలు థియేటర్లకు అలవాటు పడతారు. అలాంటప్పుడు మన సినిమా రిలీజ్ చేయాలి. అది మనకు ప్లస్ అవుతుంది. రంగస్థలం సక్సెస్ అయింది కాబట్టి, ఇలాంటి టైమ్ లో కృష్ణార్జున యుద్ధం రావడం కరెక్ట్.”

చూశారుగా ఇది నాని చెబుతున్న లాజిక్. రంగస్థలంతో పాటు తన సినిమా చూసేందుకు కూడా ఆడియన్స్ థియేటర్లకు వస్తారంటున్నాడు ఈ హీరో. ఒకవేళ 2-3నెలల నుంచి ఏ సినిమా థియేటర్లలో ఆడకపోతే, అలాంటప్పుడు తన సినిమా వచ్చినా ఉపయోగం ఉండదని, ఎందుకంటే ఆ స్లంప్ లో తన సినిమా కూడా కొట్టుకుపోతుందని అంటున్నాడు.

నాని లాజిక్ వినడానికైతే బాగుంది కానీ ప్రాక్టికల్ గా ఇది ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతుందనేది కృష్ణార్జున యుద్ధం థియేటర్లలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. రేపు ఈ సినిమా విడుదల కానుంది.