రజినీతో సహా అందరితో కన్నీళ్లు పెట్టించిన మీనా కూతురు

సీనియర్ హీరోయిన్ మీనా ఇండస్ట్రీలో బాల నటిగా అడుగు పెట్టింది. ఆమె నటిగా కెరీర్ మొదలు పెట్టి 40 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో చెన్నైలో భారీ కార్యక్రమం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఆ కార్యక్రమానికి రజినీకాంత్.. బోనీ కపూర్.. రాధిక.. రోజా.. సంఘవి.. స్నేహా.. శ్రీదేవి.. ప్రభుదేవా ఇంకా పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మీనా కూతురు నైనిక మాట్లాడిన ఒక వీడియోను ప్లే చేశారు. ఆ వీడియో లో నైనిక మాట్లాడుతూ.. అమ్మా.. నువ్వు ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టం గురించి తెలుసు. నీవు ఈ స్థాయికి రావడం పట్ల నేను చాలా గర్విస్తున్నాను. నటిగా నువ్వు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు. నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంటికి వచ్చాక మాత్రం అలా కాకుండా ప్రతి క్షణం మా గురించి ఆలోచించేదానివి.

ఒక సారి మనం మాల్ కి వెళ్లిన సమయంలో నేను పక్క షాప్ కు వెళ్లి చాక్లెట్ తింటూ కూర్చున్నాను. కొద్ది సమయం నేను కనిపించకుంటే నువ్వు పడ్డ తపన గురించి నాకు తెలుసు. ఆ సమయంలో నన్ను తిట్టావు.. నాపై అరిచావు.

ఆ రోజు నువ్వు పడ్డ కంగారు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు అమ్మా.. ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీకు అన్ని విషయాల్లో కూడా సహాయంగా ఉంటాను.

నైనిక తల్లి మీనా గురించి మాట్లాడుతున్న సమయంలో రజినీకాంత్ తో సహా అక్కడున్న వారు అంతా కూడా ఎమోషనల్ అయ్యారు. ఒక తల్లి గురించి కూతురు ఎంతగా తపన పడుతుంది అనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శణం అన్నట్లుగా సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తన తల్లి గురించి మీడియాలో వస్తున్న పుకార్లపై నైనిక స్పందిస్తూ… ఈ మధ్య కాలంలో అమ్మ గురించి వస్తున్న వార్తలకు బాధ గా ఉంది. అమ్మ కేవలం నటి అని కాకుండా మీలాగే ఒక మనిషి అనే విషయాన్ని గుర్తించాలి అంటూ నైనిక విజ్ఞప్తి చేసింది. దయచేసి అమ్మ గురించి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసి మా ఫీలింగ్స్ తో ఆడుకోవద్దని నైనిక పేర్కొంది.