కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన్న తొలి సినిమా కిరాక్ పార్టీ తర్వాతనే కెరీర్ ముగించాలని అనుకుంది. ఆ సినిమా హీరో కం డైరెక్టర్ రక్షిత్ శెట్టి చేసిన పెళ్లి ప్రపోజల్స్ కు ఓకే చెప్పిన రష్మిక ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. కానీ అదే టైం లో తెలుగులో ఛలో హిట్ అవ్వడం ఆ తర్వాత గీతా గోవిందంలో నటించడం తెలుగులో మంచి అవకాశాలు వస్తుండటం వల్ల ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఒకవేళ రష్మిక అప్పుడే పెళ్లి చేసుకుని ఉంటే ఆమె ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండేది కాదు.
రష్మిక సినిమాలో ఉంది అంటే తన స్క్రీన్ స్పేస్ ఎంతైనా సరే ఆమె ఇట్టే ఎట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు సినిమాలో మరో హీరోయిన్ కి అవసరం లేదు అన్నట్టుగా అదరగొట్టేస్తుంది. ఒకవేళ వేరే హీరోయిన్ ఉన్నా సరే డామినేషన్ తనదే అనేలా ప్రూవ్ చేసుకుంటుంది. రష్మిక నటించిన సీతారామం సినిమాలో ఓ పక్క మృణాల్ గొప్పగా నటించినా రష్మిక తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది.
ఇక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో సౌత్ స్టార్ గా ఎదిగిన రష్మిక బాలీవుడ్ నుంచి ఆఫర్లు మొదలయ్యాయి. బాలీవుడ్ లో మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా పుష్ప 1 పాన్ ఇండియా హిట్ అవ్వడంతో అమ్మడు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో చేసిన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బీ టౌన్ ఆడియన్స్ ఆమెకు ఫ్లాట్ అయిపోయారు.
ప్రస్తుతం రష్మిక రాబోతున్న సినిమాలతో కూడా భారీ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. పుష్ప 2 తో ఎలాగు మరోసారి అదరగొట్టబోతున్న రష్మిక గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాల్లో కూడా భాగం అవుతుంది. మురుగదాస్ సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రష్మిక లీడ్ రోల్ లో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా భాగం అవుతుందని తెలుస్తుంది.
మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఐతే రష్మిక ఉండగా మరో హీరోయిన్ అవసరమా అని ఫ్యాన్స్ అనుకుంటున్నా సినిమా కథలో భాగంగా ఆ పాత్ర అవసరం కాబట్టే తీసుకున్నారని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి రష్మిక సినిమా అంటే చాలు నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ అలర్ట్ అవుతున్నారు. ఒక సౌత్ హీరోయిన్ బాలీవుడ్ లో కూడా ఈ రేంజ్ ఫాం కొనసాగించడం ఈమధ్య కాలంలో రష్మిక వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు.