రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో జరిగిన మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో కూడా చరణ్ గురించి ప్రముఖ కథనాలు వచ్చాయి. చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్ మరియు అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడం వల్ల తన స్థాయి మరింత పెంచుకున్నాడు.
ఆ ఫిల్మ్ ఫెస్టివల్ విషయం పక్కన పెడితే ఆస్ట్రేలియాలో చరణ్ పర్యటన సందర్భంగా క్రికెట్ వరల్డ్ కప్ తో ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు. ఆ ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చరణ్ గురించి గొప్పగానే వారు ఆ పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. కానీ రామ్ చరణ్ ను బాలీవుడ్ మెగాస్టార్ అంటూ సంబోధించడం ఆయన ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ వర్గాల వారికి చాలా మందికి రుచించడం లేదు. అందుకే సోషల్ మీడియాలో క్రికెట్ ఆస్ట్రేలియా పై కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
రామ్ చరణ్ ను టాలీవుడ్ స్టార్ అనాలి లేదా గ్లోబల్ స్టార్ అనాలి, అదీ కాకుంటే పాన్ ఇండియా స్టార్ అనాలి.. అంతే కాని బాలీవుడ్ స్టార్ అని ఎలా పిలుస్తారు అంటూ సదరు క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ పేజ్ ను ట్యాగ్ చేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటూ సంభోదించాల్సింది పోయి ఎందుకు బాలీవుడ్ స్టార్ అన్నారు అంటూ కొందరు వారిని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ స్టార్ అంటూ చరణ్ ను సంభోదించడం అనేది చాలా మంది మెగా ఫ్యాన్స్ కి మరియు తెలుగు ప్రేక్షకులు రుచించడం లేదు.
ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు గేమ్ ఛేంజర్ ను తీసుకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చరణ్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అవ్వబోతున్నాయి. వచ్చే ఏడాదిలో ఆ సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది.