మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ముగ్గురు అభిమానులు మాత్రం రామ్ చరణ్ ను కలవడానికి ఏకంగా 230 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి వచ్చిన ఈ ముగ్గురూ ఏకంగా 230 కిలోమీటర్లు నాలుగు రోజుల పాటు నడుచుకుంటూ వచ్చారు.
సంధ్య జైరాజ్, రవి, వీరేష్.. ఈ ముగ్గురూ రామ్ చరణ్ ను తన జూబ్లీ హిల్స్ నివాసంలో కలిశారు. తన అభిమానులను రామ్ చరణ్ స్వాగించి హగ్ చేసుకుని కాసేపు మాట్లాడాడు. అలాగే తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని రామ్ చరణ్ సూచించాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఆ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న యాక్షన్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.