రామ్ చరణ్ 16.. స్క్రిప్ట్ కోసం గట్టిగానే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఒక విధంగా గేమ్ ఛేంజర్ కంటే ఈ సినిమా కోసమే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ కారణంగా సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. RC16 చిత్రానికి సంబందించిన తాజా టాక్ ప్రకారం, సినిమా స్క్రిప్ట్‌పై మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కథ రాయడానికే ఏకంగా రూ. 3 కోట్లు వెచ్చిస్తున్నారని సమాచారం.

ఇకపోతే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన వృద్ది సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సుకుమార్ రైటింగ్స్ సహకారాన్ని అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సమర్పకులుగా ఉన్నారు. ఈ భారీ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపించబోతున్నారని, అతని పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం.

బుచ్చిబాబు సాన ఇప్పటికే ‘ఉప్పెన’ సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచిన దర్శకుడు. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేసే ఈ ప్రాజెక్ట్‌ పై మరింత అంచనాలు ఉన్నాయి. సుకుమార్‌తో కలిసి పని చేయడం ద్వారా, ఈ సినిమా కథను మరింత ఆసక్తికరంగా మలచబోతున్నారని సినీ వర్గాల్లో టాక్. ఇక సినిమా షూటింగ్‌కి ముందు లొకేషన్‌లు, పాత్రలు, సన్నివేశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.