రెడ్ కార్పెట్: పాకిస్థాన్ కు పద్మావతి

ఇండియాలో పద్మావత్ సినిమా, మేకర్స్ కు ముప్పుతిప్పలు పెట్టింది. మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా నార్త్ లో అల్లర్లు ఆగలేదు. మరి ఇంత వివాదాస్పదమైన సినిమాకు పాకిస్థాన్ లో అనుమతి దొరుకుతుందా.. అసలు ఆ ఆలోచన చేయడమే వేస్ట్ అన్నారు చాలామంది. కానీ పద్మావతికి పాకిస్థాన్ ఎర్రతివాచీ పలికి మరీ స్వాగతం పలుకుతోంది.

ఎవరూ ఊహించని విధంగా పద్మావత్ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చింది పాకిస్థాన్ సెన్సార్ బోర్డు. సినిమాలో ఏ ఒక్క సన్నివేశంపై అభ్యంతరం తెలపలేదు. ఒక్క కట్ కూడా సూచించలేదు. తమ దేశంలో ఎక్కడైనా ఈ సినిమాను ప్రదర్శించుకోవచ్చని ఫుల్లుగా అనుమతి ఇచ్చేసింది.

ఈ సినిమా సెన్సార్ కు వచ్చిందని తెలిసిన వెంటనే పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఖాయీద్-ఇ-అజామ్ నుంచి ఓ సీనియర్ ప్రొఫెసర్ ను రప్పించారు. అతడి సమక్షంలో సినిమా మొత్తం చూశారు. సినిమాలో చరిత్ర వక్రీకరణ జరగలేదని అతడు చెప్పడంతో వెంటనే సెన్సార్ క్లియర్ చేశారు. త్వరలోనే ఓ మంచి రోజు చూసి పాక్ లో పద్మావత్ ను విడుదల చేయబోతున్నారు.