రేటు పెంచిన హీరో

సీనియర్ ల్లో బాలకృష్ణనే తొమ్మిది నుంచి పది కోట్లు పక్కాగా తీసుకునే హీరో. ఈ విషయంలో నాగ్, వెంకీ నిన్న మొన్నటి వరకు అయిదు, ఆరు కోట్ల దగ్గరే వున్నారు. మెగాస్టార్ రేంజ్ వేరు. అయితే ఇప్పడు వెంకీ కూడా రేటు పెంచేసారు. ఎఫ్ 3, వెంకీ మామ తరువాత నారప్ప సినిమా చేస్తున్నారు వెంకీ. ఈ సినిమా మీద కాస్త అంచనాలు వున్నాయి.

ఇలాంటి టైమ్ లో దిల్ రాజు-అనిల్ రావిపూడి కలిసి ఎఫ్ 3 ప్లాన్ చేసారు. ఈ సినిమాకు వెంకీ-వరుణ్ తేజ్ కీలకం. అందుకే ప్రాజెక్టులో షేర్ కావాలనే దగ్గర బేరం ప్రారంభించారు వెంకీ సోదరుడు సురేష్ బాబు అని బోగట్టా. ఆఖరికి పది కోట్ల రెమ్యూనిరేషన్ వరకు వచ్చింది వ్యవహారం. ఆఖరికి పది కోట్ల లోపే సెట్ అయింది కానీ, తరువాత సినిమాలకు మాత్రం ఇక రెమ్యూనిరేషన్ పది కోట్లే అన్నది ఇండస్ట్రీ టాక్.

అంటే ఇక నాగార్జున మాత్రమే మిగిలారు అన్నమాట. సీనియర్లలో అయిదారు కోట్ల రేంజ్ లో. ఓ రెండు హిట్ లు పడితే ఆయన రెమ్యూనిరేషన్ కూడా మారొచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఆ అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు.