‘బద్రి’, ‘జానీ’ సినిమాల్లో పవన్‌కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన రేణు దేశాయ్, పవన్‌కళ్యాణ్‌తో కొన్నాళ్ళు సహజీవనం చేయడం, ఆ తర్వాత ఇద్దరూ వైవాహిక బంధంతో ‘అధికారికంగా’ ఒక్కటవడం తెల్సిన విషయాలే. అధికారికంగా ‘పెళ్ళి’ జరిగాక, ఎక్కువ కాలం ఆ ఇద్దరూ ఆ ‘బంధాన్ని’ కొనసాగించలేకపోయారు. కారణమేంటి.? అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఆ ప్రశ్నకి సమాధానం రేణుదేశాయ్, పవన్‌కళ్యాణ్ మాత్రమే చెప్పాలి.
ఇక, ఆ విషయం పక్కన పెడితే రేణుదేశాయ్, పవన్ ద్వారా తనకు జన్మించిన ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ వెళుతున్నారు. వారి ఆలనా పాలనా వ్యవహారాలు ఆమే స్వయంగా చూసుకుంటున్న విషయం విదితమే. తెలుగు సినిమా వైపుగానీ, తెలుగు మీడియా వైపుగానీ ఆమె ఈ ఏడేళ్ళ కాలంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపింది లేదు. కానీ, ఇప్పుడామె బుల్లితెరపైకొచ్చేశారు అనూహ్యంగా. ఓ డాన్స్ ప్రోగ్రామ్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో మీడియాతో ఆమె టచ్‌లోకి రావాల్సి వస్తోంది. అలా వచ్చినప్పుడల్లా, ‘పవన్‌కళ్యాణ్‌తో ఎందుకు విడిపోయారు.? పవన్ మరో పెళ్ళి చేసుకున్నారు కదా, మీరూ ఇంకో పెళ్ళి చేసుకుంటారా.?’ లాంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాల్సి వస్తోంది. తప్పించుకోవడానికి వీల్లేని ప్రశ్నలివి. మొదట్లో దాటవేసినా, ఇంటర్వ్యూలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండడంతో, ఎప్పుడో ఒకప్పుడు ఆమె ‘బరస్ట్’ అవడం ఖాయం.
అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఒంటరితనం వేధించిందనీ, ఆ సమయంలో ‘తోడు’ కోరుకున్నాననీ రేణుదేశాయ్ చెప్పిన మాట పవన్ అభిమానుల్లో కొందరికి కోపం తెప్పించింది. దానికి ఆమె గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం రెండో పెళ్ళి ఆలోచనలు ఆమెలో బాగానే వున్నట్లు తెలుస్తోంది.
అయినా, అందులో తప్పేముందట.? పవన్, ఒకటి కాదు, రెండు కాదు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, రేణుదేశాయ్ రెండో పెళ్ళి చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, దాని పట్ల పవన్ అభిమానుల్లో కొందరు వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత, ఆమెను మానసికంగా ఇబ్బందిపెడుతోంది. నిజానికి ఆ వ్యతిరేకతే, ఆమెని మరింత ‘డైనమిక్’గా మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.