రేప‌ట్నించి రంగ‌స్థ‌లం పాట‌ల పండ‌గ‌

మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ రంగ‌స్థ‌లం విడుద‌ల‌కు రూట్లు క్లియ‌ర్ చేసుకుంటోంది. ఇప్ప‌టికే ఆ సినిమా పాట‌లు అభిమానుల‌కు ఎంతో న‌చ్చేశాయి. గురువారం రంగ‌స్థ‌లం అన్ని పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇక మ‌రో నెల రోజులు రంగ‌స్థ‌లం పాట‌లే ఊపేస్తాయేమో.

ఇప్ప‌టికే రంగ‌స్థ‌లంలోని మూడు పాట‌లు విడుద‌ల చేశారు. అవి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఎంత స‌క్క‌గున్నావే పాట మంచి పాట‌ల జాబితాలో ఎప్పుడో చేరిపోయింది. రంగా రంగాస్థ‌లాన స్టెప్పులేయించేలా ఉంది. ఇక రంగ‌మ్మ మంగ‌మ్మ అయితే అంద‌మైన విర‌హ‌గీతంగా మారిపోయింది. ఆ మూడు ఇప్ప‌టికే యూట్యూబ్‌లో మారుమోగిపోతున్నాయ్‌. ఇప్పుడందరూ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ది ఐటెం సాంగ్ కోసం. డీజే భామ పూజా హెగ్డే చెర్రీతో క‌లిసి డ్యాన్సు అద‌ర‌గొట్టింద‌ట‌. ఆ పాటే జిగేల్ రాణి. రేపు విడుద‌ల‌య్యే జ్యూక్ బాక్సులో ఈ పాటనే మొద‌ట అంద‌రూ వినేది. దేవిశ్రీ ప్ర‌సాద్ అదిరే మ్యూజిక్ అందించాడు ఈ సినిమాకు.

సుకుమార్‌-దేవిశ్రీ ప్ర‌సాద్‌-చంద్ర‌బోస్ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాల పాట‌ల‌న్నీ హిట్టే. ఇప్పుడు రంగ‌స్థ‌లంతో అదే రిపీట్ అవుతుంది. రంగ‌స్థ‌లం సినిమా మార్చి 30న విడుద‌ల కానుంది. ఇందులో స‌మంత .. రామ్ చ‌ర‌ణ్ తో పాటూ జ‌గ‌ప‌తిబాబు అన‌సూయ ఆది పినిశెట్టి ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. చెర్రీ అన్న‌గా తొలిసారి ఆది క‌నిపించ‌బోతున్నాడు. ఇక జ‌గ‌ప‌తిబాబు మెయిన్ విల‌న్‌గా చేస్తున్నాడు. అన‌సూయ కూడా ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌.