విజయ్ చేతిలో చెయ్యేసి.. ఏంటి మ్యాటర్?

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఖుషి సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ పోస్టర్స్ అలాగే సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు విజయ్ సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రతి పోస్ట్ కూడా హాట్ టాపిక్ గా నిలిచేలా ఏదో ఒక పాయింట్ లో అయితే హైలెట్ చేస్తున్నారు. ఇక మరోవైపు సమంత కూడా సోషల్ మీడియాలోనే సినిమాకు కావలసినంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్ ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక సెన్సిటివ్ యాంగిల్ లో కూడా ఈ సినిమా గురించి రకరకాల గాసెప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి.

ఇక వాటి సంగతి పక్కన పెడితే ఇప్పుడు విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలతో మరికొంత క్యూరియాసిటీని పెంచేశాడు. విజయ్ మరొకరి చేతిలో చేయి పెట్టి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అలాగే విజయ్ ఇలా వ్రాశాడు, “చాలా జరుగుతున్నాయి కానీ ఇది నిజంగా ప్రత్యేకమైనది – త్వరలో ప్రకటిస్తాను.” అంటూ వివరణ ఎవ్వటం వైరల్ అవుతోంది.

ఇన్‌స్టా కథకు విజయ్ వ్యక్తిగత జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది అతని కొత్త ప్రాజెక్ట్ లేదా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ గురించినా? లేక ప్రచార వ్యూహమా? అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇన్‌స్టా స్టోరీ విజయ్ దేవరకొండ ప్రేమ జీవితానికి నిదర్శనమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి విజయ్ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా హడావిడి ముగిసిన తర్వాత సెట్స్ ఉన్న మరో రెండు సినిమాలతో మరింత బిజీ కానున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో పరుశురామ్ దర్శకత్వం వహించే సినిమా చేస్తున్న విజయ్ అలాగే గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేస్తున్నాడు.