కలర్ స్వాతికి పరిచయం అవసరం లేదు. ఆమె మొదట యాంకరింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టింది. ముఖ్యంగా కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఆమెకు కలర్స్ స్వాతి అని పేరు రావడం విశేషం. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజర్ మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఆమె చాలా హిట్ సినిమాల్లో నటించారు. అష్టా చష్మా, కార్తికేయ ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అని చెప్పొచ్చు.
ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత ఆమె మళ్లీ స్క్రీన్ పై కనిపించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం సత్య అనే పాటతో ప్రేక్షకులను పలకరించారు. సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన పాట అది. ఇప్పుడు మళ్లీ మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. కొద్ది రోజుల క్రితం ట్రైలర్ విడుల చేయగా, అందరినీ ఆకట్టుకుంది.
ఈరోజు మంత్ ఆఫ్ మధు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె విడాకుల టాపిక్ రావడం విశేషం. ఓ విలేకరి, ఆమెను విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.. దీనిపై క్లారిటీ ఇస్తారా అని ప్రశ్నించారు. దానికి ఆమె తెలివిగా, నేను ఇవ్వ అంటూ చెప్పారు.
‘కలర్స్ చేసినప్పుడు తనకు కేవలం 16 సంవత్సరాలేనని, అప్పట్లో సోషల్ మీడియా ఇంత విపరీతంగా లేదని, ఇలా ఉంటే తనను ఫుట్బాల్ ఆడుకునే వారేమో. కొత్తగా వస్తున్న వారు ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో తెలియడం లేదు. నటిగా నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ఒక రూల్ ఏంటంటే.. నేను చెప్పను” అని స్వాతి అన్నారు. నవ్వుతూనే ఆమె ఆ విడాకుల టాపిక్ ని డైవర్ట్ చేయడం విశేషం.
ఇక, తాను ఈ మూవీలో లేఖ అనే పాత్ర పోషించినట్లు చెప్పారు. తెలుగు అమ్మాయిలను తాను రిప్రజెంట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజుల్లో తెలుగు అమ్మాయిలకు మొయిన్ లీడ్ రోల్స్ రావడం లేదు అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక, సాయి ధరమ్ తేజ్ తన స్నేహితుడని, ఇద్దరూ కలిసి బీఎస్సీ చదివామని చెప్పారు. తన లైఫ్ లో సాయిధరమ్ తేజ్ సపోర్ట్ సిస్టమ్ అని పేర్కొన్నారు. ఈ మంత్ మధు మూవీలో నవీన్ చంద్రకు జోడిగా ఆమె నటించడం విశేషం.