విమర్శలకు ఘాటు సమాధానమిచ్చిన సమంత

నిన్న ఆమె పోస్ట్ చేసిన ఓ స్టిల్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ బీచ్ రిసార్ట్ లో బికినీ వేసుకొని రిలాక్స్ అవుతున్న ఫొటోను సమంత పోస్ట్ చేసింది. ఫొటో సెక్సీగానే ఉంది. కానీ అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం అది నచ్చలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఈ బికినీ స్టిల్స్ ఏంటంటూ ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. దీనిపై కాస్త ఘాటుగానే స్పందించింది సమంత.

“నా రూల్స్ నేను రాసుకున్నాను. మీ రూల్స్ ఏమైనా ఉంటే మీరు రాస్కోండి” అంటూ ఓ కామెంట్ రాసి, మహిళా సాధికారికతకు సంబంధించిన ఓ కొటేషన్ కూడా పోస్ట్ చేసింది. సూటిగా చెప్పాలంటే నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి అని అర్థం వచ్చేలా కాస్త గౌరవంగా సమంత స్పందించింది.

మరోవైపు అదే సోషల్ మీడియాలో సమంతకు మద్దతు కూడా పెరుగుతోంది. బీచ్ లో ఎవరైనా బికినీతోనే కనిపిస్తారు. పద్ధతిగా చీర కట్టుకొని బీచ్ లోకి వెళ్లమంటారా అంటూ మరో వర్గం వాదిస్తోంది. సమంత పెట్టిన ఫొటోలో అసభ్యత ఏమీ లేదని వాదిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా బికినీలో కనిపించిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు.

ఇంత రచ్చకు కారణమైన ఆ ఫొటోను ఎక్కడ తీశారనే విషయంపై మాత్రం సమంత క్లారిటీ ఇవ్వలేదు. బ్యాక్ డ్రాప్ లో బీచ్ మాత్రం కనిపిస్తోంది. కచ్చితంగా అది బీచ్ రిసార్టే. కాకపోతే అది ఏ ఊరనే విషయాన్ని మాత్రం సమంత చెప్పలేదు.