వీర సింహారెడ్డిలో జయమ్మ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

హీరోయిన్ గా తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోయిన్ గా కంటే ఒక మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్. ఒక సీనియర్ స్టార్ కూతురును అనే భావన ఆమె చూపించకుండా నటనపై ఆసక్తితో తన ప్రతి పాత్రలో కూడా వైవిధ్యాన్ని కనబర్చే ఉద్దేశ్యంతో వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది.

తెలుగు లో ఈ మధ్య కాలంలో ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన క్రాక్ సినిమాలో ఈమె పోషించిన జయమ్మ పాత్ర గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. ఆ సినిమా లోని జయమ్మ పాత్ర పేరు తోనే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆమెను పిలుస్తున్నారు.

జయమ్మ పాత్ర తో ఎంతటి గుర్తింపును వరలక్ష్మి దక్కించుకుందో అదే స్థాయిలో వీర సింహారెడ్డి సినిమాలో ఆమె చేసిన పాత్ర తో గుర్తింపు దక్కించుకుంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలయ్య మరియు వరలక్ష్మిల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయని సమాచారం అందుతోంది.

హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా కూడా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు వరలక్ష్మి ఇలాంటి పాత్రలు చేస్తూ ఉంది. వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట.. ముఖ్యంగా ఆమె పాత్ర లో వచ్చే ట్విస్ట్ కు అందరి మతులు పోతాయట.

వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర వీర సింహారెడ్డి సినిమా యొక్క ఫలితం పై ప్రధానంగా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఆమె పాత్ర ను ప్రేక్షకులు అర్థం చేసుకుని ఓన్ చేసుకుంటే తప్పకుండా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

క్రాక్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వరలక్ష్మి ఈ సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి. ఈ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా టాలీవుడ్ లో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది. వరలక్ష్మి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. అవి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.