వెంకీకి హీరోయిన్ కావలెను

విక్టరీ వెంకటేష్ హీరోయిన్ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లు వుంది వ్వవహారం. ఏ హీరోయిన్ కూడా సెట్ కావడం లేదు. ఏదో ఒక డ్రా బ్యాక్ వస్తోంది. పైగా తేజ-వెంకీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఒకటి రెండు డ్యూయట్లు వుంటాయి.

త్రిష, తమన్నా, కాజల్, ఇలా సీనియర్ హీరోయిన్ల లిస్ట్ ముందేసుకుని ప్రయత్నిస్తున్నారు. త్రిష ఈ మధ్య మరీ స్లిమ్ గా తయారయింది. వెంకీ పక్కన బాగుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో అబేయన్స్ లో వుంచారు. కాజల్ డేట్ లు సమస్యగా వున్నాయి. తమన్నా ఇప్పటికే కళ్యాణ్ రామ్, సందీప్ కిషన్ ల పక్కన చేస్తోంది. మీనా గతంలో చేసింది కానీ, డ్యూయట్ లు వున్నాయని ఆలోచిస్తున్నారు.

ఇంకెవరు వున్నారు సీనియర్ హీరోయిన్లు అన్న వెదుకులాట సాగుతోంది. మరీ లేట్ అవుతోందని, హీరోయిన్ లేకుండా వున్న సీన్లతో సినిమా షూట్ చేసేయాలన్న ఆలోచన కూడా వుంది. అందరూ బాలయ్య మాదిరిగా వుండరు. ఎవరో ఒకరు హీరోయిన్ అయితే చాలు బాలయ్య చేసేస్తారు. వెంకీ అలా కాదు. బాగా ఛూజీ. అందుకే సమస్య.