శర్వా రేటు తగ్గడం లేదట

మహానుభావుడు సినిమా తరువాత మూడు ఫ్లాపులు ఇచ్చాడు శర్వానంద్. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు వున్నాయి. మూడో సినిమా డిస్కషన్ లో వుంది. చేస్తున్న సినిమాలు పూర్తి కావస్తుండడంతోనూ, హీరోల కొరత వుండడంతోనూ, శర్వా వైపు మొగ్గుచూపుదామని అనుకుంటున్నారట చాలా మంది నిర్మాతలు.

కానీ శర్వా రెమ్యూనిరేషన్ తెలిసి వెనకడుగు వేస్తున్నారని బోగట్టా. ఏడు కోట్లకు తగ్గడం లేదట శర్వా రెమ్యూనిరేషన్. లేటెస్ట్ గా చేస్తున్న శ్రీకారం సినిమాకు 14రీల్స్ ప్లస్ నిర్మాతలు ఇదే ఫిగర్ ఇచ్చారని బోగట్టా.

అందువల్ల ఇప్పుడు ఎవరికైనా శర్వా కావాలి అంటే అదే ఫిగర్ ఇవ్వాల్సిందే. శర్వాతో రెమ్యూనిరేషన్ మాత్రమే కాదు సమస్య, సినిమా కు చాలా టైమ్ తీసుకుంటారు అన్నది కూడా వుంది అని మరో టాక్ వుంది. చాలా లీజర్ గా సినిమా చేయడం అన్నది శర్వా స్టయిల్. షెడ్యూలు, షెడ్యూలుకు గ్యాప్ తీసుకుంటాడు. ఇప్పుడు చేస్తున్న శ్రీకారం కూడా ముందు అనుకున్న డేట్ కు రెడీ కాలేక వాయిదా పడింది.

శర్వా మంచి నటుడు. ఫ్యామిలీ ఆడియన్స్ సర్కిల్ లో మంచి పేరు వుంది. అదే టైమ్ లో యూత్ లోనూ క్రేజ్ వుంది. ఇలాంటి అవకాశం వున్న శర్వా, ఈ మైనస్ లు కూడా కాస్త కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో?