శోభితా చైతు డేటింగ్.. సమంత ఇచ్చిపడేసింది!

స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూనే షూటింగ్ లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీస్కొని.. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది. ఇక అప్పటి నుంచి శాకుంతలం సినిమా ప్రమోషన్ పనులతో బిజీగా మారిపోయింది. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్యతో డేటింగ్ రూమర్స్ గురించి మాట్లాడిందని కొన్ని మీడియా ఛానెళ్లు పెద్ద ఎత్తున వార్తలు రాశాయి.

ముఖ్యంగా సామ్ తన భర్తతో వైవాహిక బంధం నుంచి వేరు పడిన తర్వాత అంటే విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ ప్రేమలో పడ్డారని ఫిల్మ్ నగర్ కోడై కూసింది. ముఖ్యంగా కొన్ని ఛానెళ్లు అయితే వాళ్లిద్దరి లండన్ రెస్టారెంట్ వీధుల్లో తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో డేటింగ్ రూమర్స్ వచ్చాయి.

శాకుంతలం సినిమా ప్రమోషన్లో భాగంగగా ముంబై మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చింది. అక్కడే చైతూ శోభిత గురించి అడగ్గా… ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే నాకేంటి అని సామ్ సమాధానం చెప్పినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె స్పందించారు. తానెప్పుడూ అలా అనలేదని క్లారిటీ ఇచ్చారు.

ఎంత మందితో డేటింగ్ చేసినప్పటికీ… ప్రేమకు విలువ ఇవ్వని వాళ్లకు చివరకు కన్నీళ్లే మిగులుతాయని ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే నాకేంటి అన్నట్లు ఓ మీడియా రాసుకొచ్చింది. అయితే సామ్ స్పందిస్తూ నేను ఇలా ఎప్పుడు అన్నానని ప్రశ్నించింది. నేను ఎప్పుడూ ఇలా అనలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

సామ్ చేసిన ఈ ట్వీట్ కు నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సమంత శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఖుషీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతోంది. గతంలో కొన్నాళ్లు చిత్రీకరణ జరగ్గా… ఈమె హెల్త్ బాలేక గ్యాప్ వచ్చింది.

కానీ ఇఫ్పుడు అంతా సర్దుకోవడంతో.. విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు సిద్ధం అయిపోయింది. అయితే సామ్ విజయ్ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 1వ తేదీ 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.