శ్రీలీల‌ని టిప్స్ అడిగిన తెలుగ‌మ్మాయి!

‘బేబి’ బ్యూటీ వైష్ణ‌వి చైత‌న్య ఎంట్రీతో టాలీవుడ్ లో తెలుగమ్మాయిల ఎంట్రీ పై వాడి వేడి చ‌ర్చ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికైనా తెలుగు అమ్మాయిలంతా ప‌రిశ్ర‌మ‌కి రావాల‌ని బ‌న్నీ లాంటి వారు పిలుపు నివ్వ‌డంతో! ఈ వ్యాఖ్య‌లు కొత్త వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు భ‌రోసాని కల్పించాయి. సినిమాల‌పై ఆస‌క్తి ఉన్న అమ్మాయిల్ని ప‌రిశ్ర‌మ‌కి పంపిస్తే త‌ప్పేంటి? అని ఆలోచించడం కొంద‌రిలో మొద‌లైంది.

ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా యూ ట్యూబ్ వంటి ఛానెల్స్ వేదిక‌గా త‌మ ప్ర‌తిభ‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అలాంటి వారంద‌రిలో నూత‌నోత్స‌హం క‌నిపిస్తుంది. తాజాగా బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావు న‌టిస్తోన్న ‘స్ల‌మ్ డాగ్ హ‌స్బెండ్’ సినిమాతో మ‌రో తెలుగమ్మాయి ప్ర‌ణ‌వి మానుకోండ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు గెస్ట్ గా శ్రీలీల విచ్చేసింది. ఆమె కూడా ప‌రిశ్ర‌మ‌లోకి తెలుగు అమ్మాయిలు రావాల‌ని…ధైర్యంగా ఇక్కడ లైఫ్ ని లీడ్ చేయోచ్చ‌ని వ్యాఖ్యానించింది. ఇదే అదునుగా ప్ర‌ణ‌వి….శ్రీలీల‌ని ఇక్క‌డ ఎలా మెల‌గాలి? అన్న అంశంపై ప్ర‌త్యేకంగా టిప్స్ కూడా అడిగిన‌ట్లు తెలుస్తోంది.

వేడుక‌లో ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌నే కుర్చున్న నేప‌థ్యంలో శ్రీలీల‌ని గుచ్చి మ‌రీ టిప్స్ గురించి అడిగిందిట‌. ప‌రిశ్ర‌మ‌లో ఎలా న‌డుచుకోవాలో కాస్త చెప్పామ్మా? అంటే బౌండ‌రీస్ దాట‌కుంటా..వాటిని మెయింటెన్ చేస్తుంటే చాలు ఇక్క‌డ అంతా సేఫ్ గా ఉండొచ్చ‌ని స‌ల‌హా ఇచ్చిందిట‌.

మొత్తానికి శ్రీలీల నుంచి ప్ర‌ణ‌వి కొన్ని విలువైన సల‌హాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వీటిని తూచ త‌ప్ప‌కుండా పాటించాలి. మ‌రి ప్ర‌ణ‌వి వాటిని ఎంత‌వ‌ర‌కూ ఆచ‌ర‌ణ‌లో పెడుతుందో చూడాలి.

ప్ర‌ణ‌వి ఇప్ప‌టికే ‘రోటీన్ ల‌వ్ స్టోరీ’..’ఉయ్యాల జంపాల’ చిత్రాల్లో న‌టించింది. కొన్ని సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేసింది. కళ్యాణ్ రామ్ గారి ‘అమిగోస్‌’లోనూ నటించింది. అయితే అమ్మ‌డికి హీరోయిన్ గాఛాన్స్ రావ‌డం అన్న‌ది రీల్స్ ద్వారానే సాధ్య‌మైంది.