సింగపూర్ కూడా తలొంచక తప్పలేదు

లాక్ డౌన్ లేకుండా కరోనా అంతు తేలుద్దామని సింగపూర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతకాలం అందరూ సింగపూర్ ని చూపించి ఆ దేశాన్ని చూసి నేర్చుకోండి… ఊరికే లాక్ డౌన్ లు పెట్టి ఎకానమీని ఎందుకు నాశనం చేస్తారు అని భారత్ ను, పలు ఇతర దేశాలను వేలెత్తి చూపాయి. కానీ కరోనా కాటుకు సింగపూర్ కూడా తలొంచక తప్పలేదు. భారత్ తో పాటు పలు దేశాలు ఫాలో అయిన విధానాన్నే సింగపూర్ కూడా ఫాలో అవక తప్పడం లేదు. ఏప్రిల్ 7 నుంచి నెల రోజుల పాటు సింగపూర్ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం సింగపూర్ లో 1114 కేసులు నమోదయ్యాయి. 5 గురు మరణించారు. లాక్ డౌన్ లేకుండా కరోనా అంతం సాధ్యమే అని సింగపూర్ వేసిన ప్లాన్లు పెద్దగా ఫలితం ఇవ్వలేదు. దీంతో చివరకు లాక్ డౌన్ వైపు సింగపూర్ ప్రభుత్వం మొగ్గు చూపింది. మార్చి 31 వరకు మెల్లగా పెరిగిన కేసులు ఆ తర్వాత వేగం పుంజుకున్నాయి. దీంతో సింగపూర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. WHO కూడా ఒకట్రెండు సార్లు లాక్ డౌన్లతోనే సమస్య పరిష్కారం అవుతుందనుకోవడం తప్పు అని చెప్పింది. సింగపూర్ గురించి దాని ప్రతినిధులు కొందరు చెప్పారు. చివరకు వారికీ తప్పలేదు.

లాక్ డౌన్ మెయిన్ ఎఫెక్ట్ కరోనాను బ్రేక్ చేయడమే. అయితే దాని సైడ్ ఎఫెక్ట్ ఎకానమీని క్రాక్ చేస్తుంది. ముఖ్యంగా పూర్తిగా వ్యాపారంపై, టూరిజంపై ఆధారపడిన సింగపూర్ వంటి కంట్రీలకు లాక్ డౌన్ చాలా పెద్ద దెబ్బ. ఇది ఇతర ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేయనుంది. అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు సింగపూర్ హెడ్ క్వార్టర్ కావడమే దీనికి కారణం.