స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ప్రియాంక చోప్రా రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది.అయితే సామ్ నటించి ఓ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీన స్ట్రీమింగ్ కు రెడీ కాబోతుంది. రస్సో బ్రదర్స్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా సిటాడెల్ సిరీస్ ను తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.
అయితే ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు అందులోని నటీనటులు మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. అయితే తాజాగా సిటాడెల్ ప్రీమియర్ షోలను లండన్ లో వేశారు. ఈషోకు ఇండియన్ వెర్షన్ నటీనటులుదర్శకులు హాజరయ్యారు. ముఖ్యంగా సమంత వరుణ్ ధావన్ రాజ్ డీకే లండన్ వెళ్లారు. ప్రియాంక చోప్రాతో కలిసి మరీ ఈ షోను చూశారు.
అనంతరం లండన్ లో ఎంజాయ్ చేశారు. అంతా కలిసి ఫొటోలు దిగారు. రెస్టారెంట్ కి వెళ్లి నచ్చిన ఫుడ్ ను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే సమంత ఆ ఫొటోలను షేర్ చేసింది. అందులో వరుణ్ ధావన్ తో కలిసి దిగిన కొన్ని ఫొటోలు ఉన్నాయి. అందులో వరుణ్ బ్లాక్ సీ-త్రూ-టీ-షర్ట్ మ్యాచింగ్ డెనిమ్ షూ జాకెట్ ధరించి అదిరిపోయాడు. సమంత స్టేట్ మెంట్ నెక్ పీస్ బ్లాక్ డ్రెస్సులో మరింత అందంగా ఉంది.
అలాగే రాజ్ డీకేతో కలిసి కూడా వీరు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సామ్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు కాసేపట్లోనే వైరల్ గా మారాయి. ముఖ్యంగా వరుణ్ సమంత ఫొటోలు అయితే అద్భుతంగా ఉన్నాయి. అందులో వారిద్దరూ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలకు నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
రాజ్ – డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్.. హాలీవుడ్ షో సిటాడెల్ కు రీమేక్ గా వస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ సమంత స్పై ఏజెంట్లుగా కనిపించనున్నారు. సామ్ హెల్త్ బాలేకపోయినప్పిటీక షూటింగ్ లో పాల్గొంటుంది. రాజ్ డీకేతో కలిసి పని చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని సమంత ఇటీవలే వెల్లడించింది.