సిల్క్‌ స్మిత మళ్లీ పుట్టిందా విశాల్‌..?

తమిళ స్టార్‌ హీరో విశాల్‌ త్వరలో మార్క్ ఆంటోనీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయింది. సినిమా చాలా విభిన్నంగా ఉండబోతుందని, టైమ్ ట్రావెల్‌ మూవీ అంటూ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. విశాల్ ఇంకా ఎస్ జే సూర్య కాంబో సన్నివేశాలు విభిన్నంగా ఉండబోతున్నాయి.

ఇక ఈ సినిమా లో పలు పాత్ర లు డబుల్ రోల్‌ లో కనిపించబోతున్నాయి. ట్రైలర్‌ లో కన్ఫ్యూజన్‌ క్రియేట్ చేయడం తో పాటు సినిమాపై అంచనాలు పెంచే విధంగా కంటెంట్ ను చూపించారు. అన్నింటి కంటే ముఖ్యంగా ట్రైలర్‌ లో సిల్క్ స్మిత ను అలా మెరిసినట్లు గా చూపించారు. దాంతో నిజంగా నే సిల్క్ స్మిత ఈ సినిమాలో నటించిందా అంటూ షాక్ అవుతున్నారు.

సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ అనే అమ్మాయి తో చేయించారు. సోషల్‌ మీడియా లో ఆమె ను ఫాలో అయ్యే వారికి ఆమె జూనియర్‌ సిల్క్‌ అనే విషయం తెల్సిందే. సిల్క్ ను దించినట్లు ఆమె హావ భావాలు ఉంటాయి. అంతే కాకుండా ఆమె డ్రెస్సింగ్‌ మరియు లుక్ కూడా అలాగే ఉంటుంది.

అందుకే సినిమాకు అవసరం అయిన సిల్క్ స్మిత పాత్ర కు గాను ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాల్‌ ప్రత్యేకంగా ఆమెను ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియా లో మాత్రమే జూనియర్‌ సిల్క్ అంటూ పేరు దక్కించుకున్న విష్ణు ప్రియ గాంధీ ఈ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో జూనియర్ సిల్క్ అంటూ పిలిపించుకోవడం కన్ఫర్మ్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమా లో విశాల్ విభిన్నమైన పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా లో మన కమెడియన్ సునీల్ కూడా కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు. అయితే సునీల్‌ ను ఈ సినిమా లో విలన్ గా చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. సిల్క్‌ స్మిత పాత్ర చేసిన విష్ణు ప్రియ గాంధీకి ముందు ముందు మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.