సినిమా రంగంలో ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరకు స్క్రిప్ట్ లు ఛేంజ్ అవుతుండడం మామూలే. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న ఎమ్ఎల్ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయి) స్క్రిప్ట్ మొదట సునీల్ దగ్గరకే వెళ్లింది. కానీ కొత్త డైరక్టర్ ఉపేంద్ర తరువాత కళ్యాణ్ రామ్ దగ్గరకు షిప్ట్ అయ్యారు.
ఇదిలా వుంటే తమిళ సినిమా చతరుంగవేట్టై సినిమా ఈ మధ్య సునీల్ దగ్గరకు వచ్చింది. కానీ అంతకు ముందుగా ఆ సినిమా కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లిందట. కళ్యాణ్ రామ్ కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసారు. కానీ కళ్యాణ్ రామ్ ఆ సినిమా చేయడానికి నో అన్నారు.
తమిళ స్టయిల్ లో, బాగా నాటుగా, సీరియస్ గా వుండే ఆ సినిమాను అలాగే జిరాక్స్ కాపీగా చేయాలన్నది నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అభిప్రాయం. అలా చేస్తే, తెలుగు జనాలు మాట్నీకే వెనక్కు పంపేస్తారని, వర్కవుట్ అవ్వదని, కళ్యాణ్ రామ్ తన అభిప్రాయం చెప్పేసి, నో అనేసాడు.
దాంతో ఆ స్క్రిప్ట్ సునీల్ దగ్గరకు వచ్చింది. ఓకె అన్నాడు. అడ్వాన్స్ ఇచ్చారు. కానీ మళ్లీ అక్కడ అదే తకరారు. కృష్ణ భగవాన్ తో రీమేక్ స్క్రిప్ట్ రాయిస్తే, కాస్త నేటివిటీ, ఫన్ టచ్ వస్తుందని సునీల్ అన్నారు. అలా కాదు, జిరాక్స్ కాపీనే కావాలని మళ్లీ కృష్ణ ప్రసాద్ అన్నారు. దీంతో ఇక్కడా సినిమా ఓకే కాలేదు.
ఇక మరే హీరో దగ్గరకు వెళ్తుందో ఈ స్క్రీప్ట్ చూడాలి. తమిళ సినిమా బాగుండి వుండొచ్చు, ఆడి వుండొచ్చు. కానీ తెలుగు ఆడియన్స్ పల్స్ ను కూడా దృష్టిలో వుంచుకోవాలి కదా?