తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఆయనకు ఎంతో మంది ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా అభిమానులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో రజినీకాంత్ గురించి ఫ్యాన్స్ ఎప్పుడూ ట్రెండ్ చేస్తూనే ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ అవ్వాలంటూ ఫ్యాన్స్ స్వయంగా పబ్లిసిటీ చేసే సందర్భాలు చాలానే ఉంటాయి. ఇప్పుడు ఒక అభిమాని తనకు రజినీకాంత్ పై ఉన్న అభిమానంతో ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళ సినిమా పరిశ్రమకే చెందిన నటుడు విఘ్నేశ్ పాడ్‌కాస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీ నటులు, దర్శకులతో కంటిన్యూ గా 50 గంటల పాటు రజినీకాంత్ గురించిన లైవ్ పాడ్ కాస్ట్ ను నిర్వహించడం జరిగింది. రజినీకాంత్ విశేషాలను తన గెస్ట్ లతో చర్చించడంతో పాటు, వారికి రజినీకాంత్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ 50 గంటల షో ను లైవ్ లో చేయడం ద్వారా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మారథాన్ లైవ్ పాడ్ కాస్ట్ కి గిన్నిస్ బుక్ గుర్తింపు దక్కింది. విఘ్నేశ్ కి అరుదైన గుర్తింపును ఇవ్వడం జరిగింది.
విఘ్నేశ్ సాధించిన రికార్డ్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించాడు. ఒక వాస్ నోట్ ను పంపించిన రజినీకాంత్ అందులో… మిమ్ములను ఎలా ప్రశంసించాలో నాకు అర్థం అవ్వడం లేదు. మీరు నాపై చూపించిన అభిమానం కు మాటలు రావడం లేదు. కంటిన్యూ గా 50 గంటల పాటు ఇంటర్వ్యూలు చేశారంటే మామూలు విషయం కాదు. హ్యాట్సాఫ్ టు యూ. మీరు నాపై చూపించిన అభిమానంకు ప్రతిఫలంగా మీకు ఏం ఇవ్వాలో తెలియడం లేదు. మీరు ఎప్పటికీ నా హృదయంలో ఉంటారు. ప్రేమతో మీ రజినీకాంత్ అంటూ విఘ్నశ్ పై ప్రశంసలు కురిపించాడు.
రజినీకాంత్ జైలర్ సినిమా తర్వాత పుంజుకున్నాడు. అంతకు ముందు రజినీకాంత్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది. జైలర్ సినిమా రికార్డ్ స్థాయిలో దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. దాంతో రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్వరలో రజినీకాంత్ వెట్టయాన్ సినిమాతో రాబోతున్నాడు. తెలుగు లో ఈ సినిమాను వేటగాడు గా డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరో వైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను రజినీకాంత్ చేస్తున్నాడు. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.