సోనూ సూద్ ను కలిసిన ఖమ్మం ఫ్యామిలీ

సినిమాల్లో విలన్ గా నటించిన సోనూసూద్‌ రియల్‌ లైఫ్‌ లో మాత్రం హీరో అయ్యాడు. లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. అది గడిచి ఏడాది అవుతున్నా కూడా ఇప్పటికి లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. గత ఏడాది మోస్ట్‌ పాపులర్ అయిన సోనూసూద్‌ ఈ ఏడాదిలో కూడా కంటిన్యూ అవుతున్నాడు. ఎంతో మందికి సాయం చేసిన సోనూసూద్‌ ను కలిసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

సోనూసూద్‌ ఇటీవల హైదరాబాద్ లో ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. షూటింగ్ సెట్‌ వద్దకు ఖమ్మం నుండి ఒక ఫ్యామిలీ సోనూసూద్‌ ను కలిసేందుకు వెళ్లారు. తనను కలిసేందుకు ఒక ఫ్యామిలీ వచ్చిన విషయం తెలిసి సోనూసూద్‌ వారి కోసం వెళ్లాడు. వారు తమ అయిదు నెలల చిన్నారికి సోనాలి సూద్ అనే పేరు పెట్టుకున్నారు. సోనూసూద్‌ భార్య పేరు సోనాలి సూద్‌. తన పై అభిమానంతో తన భార్య పేరు పెట్టుకున్నందుకు మురిసి పోయిన సోనూసూద్‌ వారితో చాలా సమయం మాట్లాడి వారితో ఫొటోలు దిగి మరీ అక్కడ నుండి పంపించారు.