స్కూళ్లను టార్గెట్ చేసిన హీరో ఎందుకంటే?

  • త‌ల‌ప‌తి విజ‌య్ అందించే సామాజిక సేవ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన నాటి నుంచి సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుంటున్నారు. కాల‌క్ర‌మంలో ఆ ఫ‌రిది పెంచుకుంటూ వ‌చ్చారు. రాజ‌కీయాల్లోకి రాకముందు గొప్ప మ‌న‌సున్న సేవా త‌త్ప‌రుడు అని ముద్ర వేసేసుకున్నాడు. ఇక 2029 ఎన్నిక‌ల‌కి విజ‌య్ సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెతిస‌లిందే. `త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం` పార్టీతో బ‌రిలోకి దిగుతున్నారు.

    దీంతో 2029 క‌ల్లా రాజ‌కీయాల్లో స‌మూల మార్పులు వ‌స్తాయ‌ని ప్ర‌జ‌లు స‌హా అభిమానులు భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే విజ‌య్ అడుగులు కూడా పడుతున్నాయి. స‌మ‌యం చిక్కిన‌ప్పుడల్లా ప్ర‌జ‌ల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈనేప‌థ్యంలో విద్యార్ధుల‌కు ఇప్ప‌టికే ఎన్నో సంద‌ర్భాల్లో స‌హాయ అందించారు. వారిని ప్రోత్సహించేందుకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చారు. గతేడాది ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి విజయ్‌ ఏకంగా డైమండ్‌ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

    అలాగే తమిళనాడు రాష్ట్రంలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పై చదువుల కోసం తనవంతుగా ఆర్థిక సాయం అందించారు. తాజాగా మ‌రోసారి విజ‌య్ మంచి మ‌న‌సు చాటుకుంటున్నారు. ఇటివ‌లే త‌మిళ‌నాడు లో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెలువ‌డిన సంతి తెలిసిందే. అందులో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బ‌హుమ‌తులు అందించ‌డానికి రెడీ అవుతున్నారు.

    ఈ విష‌యాన్ని పార్టీ వ‌ర్గాలు అధికారికంగానూ ప్ర‌క‌టించాయి. జూన్ 28, జులై 8 తేదీల్లో చెన్నైలోని శ్రీ రామచంద్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజ క‌వర్గాల వీరీగా టాప్ -3 లో నిలిచిన విద్యార్ధ‌ల‌ను ఈ కార్య్రమానికి ఆహ్వానించి వారిని స‌న్మానించి అవార్డులు..రివార్డులు అందిస్తారు. ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.