సీనియర్ హీరోయిన్ లు ఇటీవలి కాలం లో రీఎంట్రీల తో పునరుజ్జీవం కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. నేటి తరం నటీమణుల తో పోటీపడుతూ ఛాలెంజింగ్ పాత్రల్లో నటించేందుకు వెనకాడడం లేదు. అయితే విద్యాబాలన్ .. రాధిక ఆప్టే తరహా లో ఎన్నడూ బోల్డ్ పాత్రలు చేయని కాజోల్ ప్రస్తుతానికి ప్రయోగాత్మక కథాంశాల ను ఎంచుకుంటోంది.
నాటి రోజుల్లోని గ్లామర్ పాత్రల ను వదిలి పెట్టి సామాజిక అంశాలు.. విద్య వైద్యం వంటి సందేశాత్మక కథా చిత్రాలతో అర్థవంత మైన సినిమాల కు కేర్ ఆఫ్ గా మారింది. అయితే ఇటీవలి కాజోల్ నిర్ణయం పై ఆమె అభిమానులు నిరాశ చెందారు. దురదృష్టవశాత్తు కాజోల్ ఇటీవలి ప్రచార స్టంట్ అనుకున్న విధంగా సాగలేదు. ఫలితంగా ఊహించని ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. #ShameonKajolHotstar అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. కాజోల్ తాజా యాక్ట్ పై అభిమానులంతా తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ కాజోల్ అంత పెద్ద తప్పు ఏం చేసింది? అంటే వివరా ల్లోకి వెళ్లాలి. తాజాగా కాజోల్ సోషల్ మీడియా బ్రేక్ ప్రకటన ఆమె అభిమానుల ను షాక్ కి ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇది తదుపరి డిస్నీ+ హాట్ స్టార్ వెబ్ సిరీస్ ‘ది ట్రయల్’కు మార్కెటింగ్ వ్యూహంగా మారింది. కాజోల్ ఈ సినిమా కి సంబంధించిన తన మునుపటి పోస్ట్ లను ఈ మాట అన్న తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఆన్ లైన్ తిరిగి పోస్ట్ చేసింది. ది గుడ్ వైఫ్ హిందీ రీమేక్ కోసం మోషన్ పోస్టర్ ను షేర్ చేసింది.
అయితే ఇలాంటి రిపీటెడ్ ప్రచారం ఏమంత మంచిది కాదు మ్యాడమ్ అంటూ అభిమానులు సీరియస్ అవుతున్నారు. నిరంతరం కాజోల్ ని అనుసరించే అభిమానుల కు ఇది నిజంగా తీవ్ర నిరాశగా మారింది. కాజోల్ సోషల్ మీడియా ను పిఆర్ ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా ఉపయోగించుకోవడం పై చాలా మంది ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కాజోల్ నటించిన ‘ది ట్రైల్’ సిరీస్ గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా ఉంటుందని #HotstarSpecials లైనప్ లో భాగంగా జూన్ 12వ తేదీన ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారని తెలిసింది.