ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల కాల్పుల కలకలం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకుని విచారిస్తున్నారు. ఇంతకుముందే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తవ్వే కొద్దీ నిజాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కాల్పులు జరిపిన ఆరుగురు నిందితులలో ఒకరైన విక్కీ గుప్తా, తాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పాత్రతో ప్రభావితమయ్యానని బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు ఎటువంటి హాని కలిగించలేదని పేర్కొన్నాడు. బెయిల్ కోసం ప్రత్యేక కోర్టు ముందు హాజరైన విక్కీ గుప్తా.. లారెన్స్ బిష్ణోయ్‌కి కాల్పులతో సంబంధం లేదని చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. సల్మాన్ ఖాన్ ఇంటి బయట షూట్ చేయమని గ్యాంగ్‌స్టర్ తనకు నేరుగా చెప్పలేదని విక్కీ గుప్తా పేర్కొన్నాడు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కనిపించే లారెన్స్ బిష్ణోయ్ పాత్ర తనను ప్రభావితం చేసిందని అతడు చెప్పాడు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ సూత్రాలు .. భగత్ సింగ్ అనుచరుడిగా అతని నమ్మకాలకు తాను ఆకర్షితుడనయ్యానని, లారెన్స్ బిష్ణోయ్ అయస్కాంత శక్తి అని విక్కీ గుప్తా చెప్పాడు.
లారెన్స్ బిష్ణోయ్ బయటకు వచ్చినప్పుడు కేసు గురించి తెలియజేస్తానని అన్నారు. సమాచారాన్ని లీక్ చేయవచ్చని ప్రాసిక్యూషన్ పేర్కొన్నందున విక్కీ గుప్తా బెయిల్ పిటిషన్‌లో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అయితే సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా రికార్డులకెక్కాడు. లారెన్స్ సోదరుడు అన్మోల్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. విక్కీ గుప్తా మాట్లాడుతూ.. బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావించే రెండు కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయానికి ప్రతిస్పందనగా కాల్పులు జరిపినందుకు అతనికి భయాన్ని కలిగించడానికి మాత్రమే దీనిని ప్లాన్ చేసారని చెప్పాడు. తాను సాగర్‌కుమార్ పాల్‌తో షూట్ చేయాల్సిన పనికి మాత్రమే నియమితుడనయ్యానని, నిరుద్యోగిగా ఉన్నందున కుటుంబాన్ని పోషించడానికి డబ్బు లేనందున, డబ్బు సంపాదించడానికి ఇది ఖచ్చితంగా మార్గం అని భావించినట్టు విక్కీ చెప్పాడు.
ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కోర్టు ముందు పోలీసులు దాఖలు చేసిన 1,735 పేజీల ఛార్జిషీట్‌లో గుప్తా, సాగర్‌కుమార్ పాల్, సోనుకుమార్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, మహ్మద్ రఫీక్ చౌదరి, హర్పాల్ సింగ్, అనుజ్‌కుమార్ థాపన్ సహా తొమ్మిది మందిని పోలీసులు పేర్కొన్నారు.