మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నాగభైరు సుబ్బారావు అనారోగ్యానికి గురై ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో వైద్యం ఖర్చలు మొత్తం చిరంజీవి ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించారు. అనంతరం సుబ్బారావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ వైద్యానికి రెండు లక్షలకు పైగా ఖర్చు అయినట్లు సుబ్బారావు తెలిపారు.
‘తీవ్ర జ్వరంతో ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చేరాను. డాక్టర్లు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నా? షుగర్ ఉండటంతో కంపెనీ వాళ్లు క్లైమ్ అవ్వదని డిక్లైన్ చేసారు. దీంతో అప్పటికప్పుడు రెండు లక్షలు ఎక్కడ నుంచి తీసుకురావాలో తెలియక మదన పడుతన్నాను. వెంటనే చిరంజీవి గారికా ఫోన్ లో ఓ మెసజ్ పంపించాను. ఆయన వెంటనే స్పందించి ఏమైందని ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యం ఖర్చు గురించి ఏం ఆలోచించకు. అవన్నీ చూసుకుందామని అప్పటికప్పుడు మనిషిని పంపించి బిల్లులు సెటిల్ చేసారు. చిరంజీవి గారు బర్త్ డే కాబట్టి చాలా బిజీగా ఉంటారు. మెసెజ్ చూడటానికి రెండు రోజులైనా సమయం పడుతుందనుకున్నా. కానీ గంటలోనే స్పందించారు. ఆయనకు ఆ అసవరం లేదు. కానీ ఆయన స్పందించారు. హ్యాట్సాఫ్ టూ మెగాస్టార్. ఇండస్ట్రీలో మన మనుషులు అంటే ఆయన ఎంతో కేర్ తీసుకుంటారు.
అందుకు ఇదొక నిదర్శనం. 30 ఏళ్లగా చిరంజీవిగారితో పరిచయం ఉంది. చెన్నైలో ఉన్న నాటి నుంచి ఉంది. ఒక మెసెజ్ పెడితే చాలు ఆయన నుంచి వెంటనే రిప్లై ఉంటుంది. ఇది నేను గర్వంగా చెప్పగలను. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో వాళ్ల పీఆర్వోల దగ్గరకు వెళ్లడానికే ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. కానీ చిరంజీవి లాంటి లెజెండరీ స్పందించడం ఆయన మంచి మనసుకు నిదర్శనం’ అని అన్నారు.