70వ జాతీయ అవార్డుల విజేత‌లు వీరే!

70వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల‌ను కేంద్రం ప్ర‌క‌టించింది. ఉత్త‌మ చిత్రం అవార్డు మ‌ల‌యాళ సినిమా `అట్ట‌మ్` కి వ‌రించ‌గా, ఉత్త‌మ న‌టుడి అవార్డు `రిష‌బ్ శెట్టి`ని వ‌రించింది. ఉత్త‌మ న‌టిగా నిత్యామీన‌న్, మాన‌సీ ప‌రేఖ్ లు సంయుక్తంగా జ్యూరీ ఎంపిక చేసింది. 2022 డిసెంబ‌ర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాల‌కు గానూ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఆ సినిమాలు..విజేత‌లు వీరే.

ఫీచ‌ర్ సినిమాలు: ఉత్త‌మ చిత్రం: అట్టం(మ‌ల‌యాళం), ఉత్తమ న‌టుడు: రిష‌బ్ శెట్టి( కాంతార‌-క‌న్న‌డ‌) ఉత్త‌మ న‌టి : నిత్యామీన‌న్( తిరుచిట్రంబ‌ళం-త‌మిళం), మాన‌సీ ఫ‌రేఖర్(క‌చ్ ఎక్స్ ప్రెస్-గుజ‌రాతీ), ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం(తెలుగు): కార్తికేయ‌-2, ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం(క‌న్న‌డం): కేజీఎఫ్‌-2, ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం(త‌మిళం): పొన్నియ‌న్ సెల్వ‌న్-1, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: సూరజ్ బ‌ర్జాత్యా)(ఉంఛాయి-హిందీ), బెస్ట్ ఫిల్మ్ ప్ర‌మోటింగ్ నేష‌న్, సోష‌ల్ ఎన్విరాన్ మెంట‌ల్ వ్యాల్యూస్: (క‌చ్ ఎక్స్ ప్రెస్ -గుజ‌రాతీ),

ఉత్త‌మ హోల్ స‌మ్ ఎంట‌ర్ టైన్ మెంట్: కాంతార‌(క‌న్న‌డ‌), ఉత్త‌మ విజువ‌ల్ ఎఫెక్స్ట్ : బ్ర‌హ్మాస్త్ర‌-1హిందీ , ఉత్త‌మ ద‌ర్శ‌కుడు (డెబ్యూ): ప్ర‌మోద్ కుమార్(హ‌రియాన్వీ), ఉత్త‌మ స‌హాయ న‌టి: నీనా గుప్తా( ఉంఛాయి-హిందీ), ఉత్త‌మ స‌హాయ న‌టుడు: ప‌వ‌ర్ రాజ్ మ‌ల్హోత్రా(ఫౌజా-హ‌రియాన్వి), బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ: పొన్నియ‌న్ సెల్వ‌న్-1(త‌మిళం) సినిమాటోగ్రాఫ‌ర్: ర‌వి వ‌ర్మ‌న్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్( మ‌లికాపుర‌మ్- మ‌ల‌యాళం), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్: క‌చ్ ఎక్స్ ప్రెస్-గుజ‌రాతీ, నిక్కీజోషీ), బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్- అప‌రాజీతో-ఆనంద్ ఆద్య‌),

బెస్ట్ ఎడిటింగ్: అట్టం- మ‌హేష్ భువ‌నేండ్, బెస్ట్ సౌండ్ డిజైన్: పొన్నియ‌న్ సెల్వ‌న్-1 ఆనంద్ కృష్ణ‌మూర్తి), బెస్ట్ స్క్రీన్ ప్లే ఒరిజిన‌ల్: అట్టం-ఆనంద్ ఏకార్షీ, బెస్ట్ డైలాగ్ రైట‌ర్: గుల్ మోహ‌ర్, అర్పితా ముఖ‌ర్జీ, రాహుల్.వి.చిట్టెల‌, బెస్ట్ కొరియోగ్ర‌ఫీ: జానీ మాస్ట‌ర్, స‌తీష్ కృష్ణ‌న్-తిరుచిట్రంబ‌ళం( త‌మిళ్), ఉత్త‌మ సంగీతం: బ్ర‌హ్మాస్త్ర-ప్రీత‌మ్, ఉత్త‌మ నేప‌థ్య సంగీతం- పొన్నియ‌న్ సెల్వ‌న్ ( ఏ.ఆర్ రెహమాన్), ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం ఒడియా: ద‌మ‌న్, మ‌ల‌యాళం- సౌది వెళ్ల‌క్క సీసీ, మ‌రాఠీ: వాల్వీ( ది టెర్మైట్), హిందీ-( గుల్ మోహ‌ర్), బెంగాళీ – క‌బేరీ అంత‌ర్దాన్), పంజాబీ- బాగీ డి దీ) నిలిచాయి.

నాన్ ఫీచ‌ర్ సినిమాలు జాబితా ఇది, బెస్ట్ డాక్యుమెంట‌రీ- మ‌ర్మ‌ర్స్ ఆఫ్ ది జంగిల్-మ‌రాఠీ, బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్ట‌ర్- మ‌ధ్యంత‌ర‌(ఇంట‌ర్ మిష‌న్) క‌న్న‌డ ద‌ర్శ‌కుడు బ‌స్తీ దినేష్ షెనోయ్, బెస్ట్ నాన్ ఫీచ‌ర్ ఫిల్మ్- అయ‌నా(మిర్ర‌ర్) , బెస్ట్ డైరెక్ష‌న్- ఫ్ర‌మ్ ది షాడో- మిరియం చాండీ మినాచెరీ, బెస్ట్ షార్ట్ ఫిల్మ్- ఉన్యుత‌(వాయిడ్)_అస్సామీ, బెస్ట్ యానిమేష‌న్ సినిమా- ఏ కోకోన‌ట్ ట్రీ(సైలెంట్), బెస్ట్ ఎడిటింగ్_- ఇంట‌ర్ మిష‌న్ క‌న్న‌డ ఎడిట‌ర్ సురేష్ , బెస్ట్ సౌండ్ డిజైనర్- యాన్ (వెహికిల్) మాన‌స్ చౌద‌రి, బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్: మోనో నో అవేర్- సిద్దార్ద్ దివాస్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్- పుర్స‌త్ (లీజ‌ర్) విశౄల్ భ‌రద్వాజ్, ఉత్త‌మ క్రిటిక్:_దీప‌క్_ దుహా (హిందీ)