ప్రియా వారియర్: ఇంటర్నెట్ సెన్సేషన్

ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవరికి, ఎప్పుడు, ఎలా క్రేజ్ వస్తుందో చెప్పలేం. ఇదిగో ఈ 18ఏళ్ల ముద్దుగుమ్మకు అలాంటి అదృష్టమే పట్టింది. మొన్నట్నుంచి ఈమె ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే 30గంటలు దాటినా ఇంటర్నెట్ లో ఈమె హవా కొనసాగుతూనే ఉంది. పేరు ప్రియా ప్రకాష్ వారియర్.

మొన్నటివరకు ఈమె పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. హీరోయిన్ అవ్వాలనుకుంది కానీ అదిప్పటివరకు సాద్యంకాలేదు. ఈ గ్యాప్ లో త్రిసూర్ లోని విమలా కాలేజ్ లో బికామ్ చేస్తోంది. మధ్యమధ్యలో మోడలింగ్ చేస్తూనే, మోహినీఆట్టం కూడా నేర్చుకుంటోంది. అలా అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న ప్రియకు, ఓరు అడార్ లవ్ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ చిన్న క్లిప్ విడుదల చేశారు.

అదిగో.. అలా క్లిప్ విడుదల చేసినప్పట్నుంచి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది ప్రియా వారియర్. వీడియోలో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, లుక్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. లెక్కలేనన్ని క్లిక్కులు రావడమే కాదు, ప్రియా ఇన్ స్టా గ్రామ్ పేజీకి కూడా అమాంతం ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఈ ఒక్క వీడియోతో ప్రియా వారియర్ జాతీయస్థాయిలో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. పనిలోపనిగా ఈ సినిమా వీడియోకు కూడా మంచి పాపులారిటీ వచ్చేసింది. సడెన్ గా వచ్చిన ఈ క్రేజ్ ఆమెకు ఇంకెన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి.